కాకా ఇంకోటి చేద్దాం...'క్రాక్' డైరెక్టర్ తో రామ్?

By Surya Prakash  |  First Published Jul 5, 2021, 10:14 AM IST

 ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ పూర్తిగా యాక్షన్  మోడ్ లోకి వచ్చేసాడు. గోపీచంద్ మలినేని సైతం క్రాక్ అంటూ మాస్ సినిమాతో హిట్ కొట్టాడు కాబట్టి..మనం కలిపి సినిమా చేద్దాం అని కబురు పంపారని ఫిల్మ్ నగర్ తాజా వార్త. 


హిట్ డైరక్టర్ తో సినిమా చేయాలని హీరోలందరికీ ఉంటుంది. హిట్ కొట్టకముందు అదే దర్శకుడు దగ్గరకు కథ పట్టుకుని వచ్చినా నచ్చకపోవచ్చు. కానీ హిట్ కొట్టాక అందులో రకరకాల విశేషాలు కనపడతాయి. ఇప్పుడు గోపిచంద్ మలినేని కు అదే విధంగా చాలా మంది హీరోల నుంచి ఆఫర్స్ వస్తున్నాయట. వాళ్లందరికి  గోపిచంద్ మలినేని గతంలో కథలు చెప్పే ఉన్నాడు. కానీ ముందుకు వెళ్లలేదు. ఎప్పుడైతే క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యిందో ఇంతకు ముందు చెప్పిన కథ చేసేద్దాం అని పిలుపులు వస్తున్నాయిట. రామ్ దగ్గర నుంచి ఈ దర్శకుడుకు పిలుపు వచ్చిందిట. అయితే రామ్ ది వేరే కథ. అతను మాస్ సినిమాలు కోసం ఎదురుచూస్తున్నాడు.

 ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో  'పండగ చేస్కో' వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి లైటర్ వీన్ సినిమాలు చేసే మూడ్ లో లేడు. పూర్తి స్దాయి యాక్షన్ తో కూడిన సినిమాలు చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ పూర్తిగా యాక్షన్  మోడ్ లోకి వచ్చేసాడు. గోపీచంద్ మలినేని సైతం క్రాక్ అంటూ మాస్ సినిమాతో హిట్ కొట్టాడు కాబట్టి..మనం కలిపి సినిమా చేద్దాం అని కబురు పంపారని ఫిల్మ్ నగర్ తాజా వార్త. అన్ని వర్కవుట్ అయితే గోపీచంద్ మలినేని .. రామ్ హీరోగా మరో ప్రాజెక్టును సెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

Latest Videos

ఇక ప్రస్తుతం రామ్ .. లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతో పాటు తమిళంలోను విడుదల కానున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా అలరించనుంది.  ఈ సినిమా తరువాత రామ్ .. గోపీచంద్ మలినేని ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు. అలాగే గోపీచంద్ మలినేని తన తాజా చిత్రాన్ని బాలయ్యతో ప్లాన్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ కథ నడుస్తుంది.

click me!