ముంబై లో ఖరీదైన బంగ్లా కొన్న చరణ్... ఇంట్రెస్టింగ్ డిటైల్స్

Published : Jul 05, 2021, 09:28 AM IST
ముంబై లో ఖరీదైన బంగ్లా కొన్న చరణ్... ఇంట్రెస్టింగ్ డిటైల్స్

సారాంశం

స్టార్ హీరోగా అనేక వ్యహారాలు, మీటింగ్స్ కోసం రామ్ చరణ్ తరచూ ముంబై వెళుతూ ఉంటారు. ముంబై వెళ్లిన ప్రతిసారి చరణ్ స్టార్ హోటల్స్ లో విడిది చేయాల్సి వస్తుందట. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబైలో సొంత ఇల్లు కొనాలని చరణ్ చాలా కాలంగా ప్రణాళికలలో ఉన్నారట.

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన రామ్ చరణ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొన్నట్లు సమాచారం అందుతుంది. ఇటీవల ఆయన భార్య ఉపాసనతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశ పూజా కార్యక్రమం కూడా నిర్వహించారట. ముంబైలోని ఖార్ ఏరియాలో అందమైన అరేబియా సాగర తీరం కనిపించేలా అత్యంత విలాసవంతమైన భవనం దక్కించుకున్నారట. 


స్టార్ హీరోగా అనేక వ్యహారాలు, మీటింగ్స్ కోసం రామ్ చరణ్ తరచూ ముంబై వెళుతూ ఉంటారు. ముంబై వెళ్లిన ప్రతిసారి చరణ్ స్టార్ హోటల్స్ లో విడిది చేయాల్సి వస్తుందట. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబైలో సొంత ఇల్లు కొనాలని చరణ్ చాలా కాలంగా ప్రణాళికలలో ఉన్నారట. ఎట్టకేలకు ఆయన కల నెరవేరినట్లు తెలుస్తుంది. కొనుగోలు చేసిన కొత్త ఇల్లు ఉన్న ప్రదేశం, సౌకర్యాలు, డిజైన్ ఇలా ప్రతి విషయంలో చరణ్ సంతృప్తికరంగా ఉన్నారట. 


ఇక హైదరాబాద్ లో కూడా చిరంజీవి కుటుంబం రెండేళ్ల క్రితం కొత్త ఇంటికి మారారు. కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన హంగులతో నిర్మించిన కొత్త ఇంటిలోకి వెళ్లడం జరిగింది. తాజాగా ముంబైలో ఖరీదైన ఇంటికి దక్కించుకొని రామ్ చరణ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 


మరోవైపు రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరిన నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ నిరవధికంగా జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అయితే ఆ సమయానికి మూవీ విడుదలయ్యే అవకాశం లేదన్న మాట వినిపిస్తుంది. అలాగే తండ్రి చిరంజీవితో కలిసి చేస్తున్న ఆచార్య షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?