కార్తీ సరసన నటించనున్న రకుల్

Published : Dec 13, 2016, 11:25 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కార్తీ సరసన నటించనున్న రకుల్

సారాంశం

త్వరలో కార్తీ సరసన నటించనున్న రకుల్ డ్రీమ్ వారియర్స్ బేనర్ పై కార్తీ హీరోగా మూవీ  

వరుస హిట్లతో లక్కీగాళ్ గా పేరుతెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ ముద్దుగుమ్మ త్వరలోనే తమిళ హీరో కార్తీ సరసన నటించేందుకు రంగం సిద్ధంమవుతోంది.

 

కాష్మోరా స‌క్సెస్ త‌ర్వాత హీరో కార్తీ మ‌ణిర‌త్నం సినిమా కాట్రు వెలియ‌డు సినిమాలో న‌టించాడు. ప్ర‌స్తుతం సినిమా రీ రికార్డింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమా త‌ర్వాత కాష్మోరా చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియ‌ర్ బ్యాన‌ర్‌పై కార్తీ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

 

ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌బోతున్నాడు. వినోద్ అనే దర్శ‌కుడు తెరకెక్కించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సినిమాలో కార్తీ స‌ర‌స‌న హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి తెలుగులోనే చేతి నిండా ఆఫర్స్‌తో బిజీగా ఉన్న ర‌కుల్, మ‌రి కార్తీ ప‌క్క‌న న‌టిస్తుందా లేదా అనేది ప్రస్థుతానికి సస్పెన్స్.

PREV
click me!

Recommended Stories

Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..