విజయ్ దేవరకొండ అంటే క్రష్.. రకుల్ కామెంట్స్!

Published : Sep 28, 2019, 03:47 PM IST
విజయ్ దేవరకొండ అంటే క్రష్.. రకుల్ కామెంట్స్!

సారాంశం

'నీకు సెలబ్రిటీలలో ఎవరైనా క్రష్ ఉన్నారా..?' అని మంచు లక్ష్మి ప్రశ్నించగా.. 'బాలీవుడ్ లో రణవీర్ సింగ్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం' అని రకుల్ చెప్పుకొచ్చింది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా ఈ బ్యూటీ 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే షోలో పాల్గొంది. మంచు లక్ష్మి హోస్ట్ చేస్తోన్న ఈ షోలో రకుల్ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.

'నీకు సెలబ్రిటీలలో ఎవరైనా క్రష్ ఉన్నారా..?' అని మంచు లక్ష్మి ప్రశ్నించగా.. 'బాలీవుడ్ లో రణవీర్ సింగ్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం' అని రకుల్ చెప్పుకొచ్చింది. ఇదే సందర్భంగా తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో కూడా రకుల్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ షోలోసమంత, వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ఇటీవల వారికి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. రకుల్ ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమాలో నటిస్తోంది. కమల్ హాసన్ నటిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు.

కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రకుల్ సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో 'మర్జావా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 'మన్మథుడు 2' విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆమెకి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌