టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ వెలుగు వెలిగింది. కాయాన్ని అంతే వేగంగా ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. దీనితో రకుల్ బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కలసి రాలేదు.
టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ వెలుగు వెలిగింది. కాయాన్ని అంతే వేగంగా ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. దీనితో రకుల్ బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కలసి రాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా అగ్ర నటులతో నటించింది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజుల క్రితమే రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే జాకీ భగ్నానీ, రకుల్ దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.
ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. పెళ్ళికి పదిరోజుల సమయం మాత్రమే ఉండడంతో రకుల్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. పెళ్లి ఏర్పాట్లు ఉంటే బయట ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. షాపింగ్స్ ఎక్కువగా ఉంటాయి. రోజంతా కారులో అటు ఇటూ తిరుగుతూనే ఉండాలి.
రకుల్ ప్రీత్ సింగ్ కి కార్లకు ఎలాంటి లోటు ఉండదు. కానీ రకుల్ మాత్రం వెరైటీగా ఆటోలో వెళ్ళింది. పొట్టి గౌనులో రకుల్ ఆటోలో వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు.
గోవాలో వీరిద్దరి వివాహం జరగబోతోంది. అయితే ముందుగా రకుల్, జాకీ భగ్నానీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా తమ పెళ్లి జరగాలని కోరుకున్నారు. కానీ చివరికి గోవాకి ఫిక్సయ్యారు. రకుల్, జాకీ మధ్య ప్రేమ చిగురించింది గోవాలోని అని సమాచారం. అందుకే సెంటిమెంట్ గా పెళ్లి కూడా ఇక్కడే చేసుకోబోతున్నారు.