స్పోర్ట్స్ కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్.. కాస్ట్ కాస్త ఎక్కువే..

By Mahesh Jujjuri  |  First Published Feb 10, 2024, 3:41 PM IST

మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా, సింగర్ గా అందరికి తెలిసిన తార. క్యాన్సర్ మహమ్మరిని జయించి గెలిచిన ఈ బ్యూటీ.. తాజాగా తన గ్యారేజ్ లో కొత్త కారును చేర్చింది. 


మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ , నాగార్జున, వెంకటేష్ లాంటిస్టార్ హీరోలతో సినిమాలు చేసింది బ్యూటీ. నటిగానే కాకుండా.. సింగర్ గా కూడా మంచి ఇమేజ్ ను సాధించింది మమతా మోహన్ దాస్. ఆతరువాత ఇండస్ట్రీలో కొనసాగలేకపోయారు. ఆమె ఆరోగ్యం గట్టిగా దెబ్బతిన్నది. 

మమతా మోహన్ దాస్ ను  ఆమెను క్యాన్సర్ అటాక్ చేసింది. అయినా పోరాడి నిలబడ్డారు. ప్రాణాంతక వ్యాధి నుండి విముక్తి పొందారు. ఆహార నియమాలు, వ్యాయామం తో క్యాన్సర్ ని జయించినట్లు మమతా మోహన్ దాస్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. అప్పుడప్పుడుసోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను పలకరిస్తుంటుంది. 

Latest Videos


తాజాగా ఈ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్‌ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన షెడ్డులో ఇప్పటికే కొత్త కార్లు చాలా ఉండగా.. తాజాగా ఈ కారు వచ్చి చేరింది. గతంలో కూడా తనకు ఇష్టమైన స్పెర్డ్స్ కారు కొనుగోలు చేసింది బ్యూటీ.`ఫోర్చె911 కారెర్రా` మోడల్‌ కి చెందిన స్పోర్ట్స్  కారుని గతంలో కొనింది మమత. 

ఇక తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ భాషల్లో యాక్ట్‌ చేసినా ఎక్కువగా మలయాళంలోనే గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహాన్ దాస్. ప్రస్తుతం కేరళలోనే సెటిల్ అయ్యింది బ్యూటీ.  
 

click me!