కండోమ్ టెస్టర్ గా రకుల్.. ఈ రోల్ చేస్తే కెరీర్ ఇబ్బందే, ఆమె తల్లిదండ్రుల రియాక్షన్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 07, 2022, 02:04 PM IST
కండోమ్ టెస్టర్ గా రకుల్.. ఈ రోల్ చేస్తే కెరీర్ ఇబ్బందే, ఆమె తల్లిదండ్రుల రియాక్షన్..

సారాంశం

ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది రకుల్. మరికొన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా రకుల్ బాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీలో నటిస్తోంది.  తేజాస్ దర్శకత్వంలో, రోనీ స్క్రూవాలా నిర్మాణంలో రకుల్ నటిస్తున్న చిత్రం   'ఛత్రివాలి'(Chhatriwali).

ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది రకుల్. మరికొన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా రకుల్ బాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీలో నటిస్తోంది.  తేజాస్ దర్శకత్వంలో, రోనీ స్క్రూవాలా నిర్మాణంలో రకుల్ నటిస్తున్న చిత్రం   'ఛత్రివాలి'(Chhatriwali). ఈ మూవీలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటిస్తోంది. ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయింది . 

ఫస్ట్ లుక్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కండోమ్ ప్యాకెట్ ని ఓపెన్ చేస్తూ కనిపిస్తోంది. కండోమ్ టెస్టర్ అంటే.. కండోమ్ నాణ్యతని అనుభవపూర్వకంగా శృంగారంలో పాల్గొని తెలుసుకునితెలుసుకోవాలి. కండోమ్ తయారు చేసిన కంపెనీకి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. దీనితో కండోమ్ టెస్టర్లు కంపెనీ నుంచి వేతనం పొందుతారు. రకుల్ పోషిస్తున్న ఈ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇక కథ పరంగా శృంగార సన్నివేశాలు ఉంటాయి. 

ఇలాంటి చిత్రంలో నటించడంపై తాజాగా రకుల్ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రంలో ఫ్యామిలీస్ చూడలేనంత అసభ్యంగా ఏమీ చూపించడం లేదు. వాస్తవానికి ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రాన్ని చూడాలి. ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే అవగాహన పెరుగుతుంది అని రకుల్ ప్రీత్ తెలిపింది. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి ఉద్యోగం కోసం కండోమ్ టెస్టర్ గా మారిన అమ్మాయి కథే ఈ చిత్రం. 

ఇలాంటి పాత్రల వల్ల కెరీర్ కి కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ అలాగని ఇలాంటి చిత్రాలని దూరం చేసుకోకూడదు. అందుకే నటిస్తున్నా అని రకుల్ పేర్కొంది. ఈ చిత్రం గురించి మా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వారు వెంటనే చేయమని ఎంకరేజ్ చేశారు. నా ప్రతి చిత్రం గురించి మా తల్లిదండ్రులతో చెబుతాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆడియన్స్ వాళ్లే అని రకుల్ పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు