#RakulPreetSingh స్టార్ హీరోకు సోదరిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

By Surya PrakashFirst Published Feb 11, 2024, 8:38 AM IST
Highlights

పెద్దతెరకు రకుల్‌ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్‌ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాలో రకుల్‌ నటించబోతుందని ఆ వార్త సారాంశం. 

 ఒకప్పుడు టైమ్ లో  టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపింది  రకుల్‌ ప్రీత్‌ సింగ్.. చిన్న హీరోలతో మొదలెట్టి స్టార్ హీరోల సినిమాలు చేసింది.  రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ మొదలు రవితేజ లాంటి స్టార్‌ హీరోల వరకు అందరితో రకుల్‌ నటించింది. బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ వంటి హీరోలతో చేసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్‌ కాలేదు. అతి  తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు ఈ బ్యూటీకి అటు బాలీవుడ్‌తో పాటు ఇటు తెలుగులోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్‌లో అలయాన్‌ సినిమా చేస్తే అదీ జస్ట్ ఓకే అనిపించుకుంది . ఈ క్రమంలో ఆమె  వెస్‌ సిరీస్‌ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. అయితే ఇక పెద్దతెరకు రకుల్‌ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్‌ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాలో రకుల్‌ నటించబోతుందని ఆ వార్త సారాంశం. అయితే స్టార్ హీరోకు సోదరిగా ఆమె కనిపించనుందని తెలుస్తోంది. 

ఆ హీరో ఎవరో కాదు కేజీఎఫ్ ఫేమ్ యష్. బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారి తెరెక్కించే రామాయణంలో యష్ రావణుడుగా కనిపించబోతున్నారు. ఈ క్రమంలో రావణుడు సోదరిగా  రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్‌ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్‌ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్‌ టెస్ట్‌ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది.  అయితే ఇందులో యష్ హీరో కాదు కాబట్టి ఆమె ఈ పాత్రకు ఒప్పుకుంది అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పెళ్లితర్వాత రకుల్ నటించబోయే తొలి సినిమా రామాయణం అవుతుంది. 

Latest Videos

ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్‌ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు.రావణుడిగా యష్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్‌ పనులు ప్రారంభం అయ్యాయి.  2025 దీపావళి కానుకగా రామాయణం తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట.

click me!