సిగరెట్ సీన్స్ పై ట్రోల్స్.. స్పందించిన రకుల్!

Published : Jul 16, 2019, 05:15 PM IST
సిగరెట్ సీన్స్ పై ట్రోల్స్.. స్పందించిన రకుల్!

సారాంశం

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తోన్న చిత్రం 'మన్మథుడు 2'. 

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తోన్న చిత్రం 'మన్మథుడు 2'. ఈ సినిమాలో కీర్తి సురేష్, అక్షర గౌడ వంటి తారలు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. 

ఆగస్ట్ 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై మంచి టాక్ ని దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా.. రకుల్ కోసం స్పెషల్ గా ఓ టీజర్ ని వదిలింది చిత్రబృందం.

సినిమాలో రకుల్ పాత్రలో రెండు కోణాలుంటాయి. టీజర్ లో ఓ సీన్ లో రకుల్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తుంది. ఈ సీన్లు చూసిన నెటిజన్లు మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేశారు.

తాజాగా ఈ విషయంపై రకుల్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ని ఈ విషయమై స్పందించగా.. ''జనాల పనే చెప్పడం.. వాళ్లు ఏదోకటి చెబుతూనే ఉంటారు'' అంటూ అసహనం వ్యక్తం చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Rajamouli: ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం..
Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?