ఆ హీరోయిన్ ని కాపీ కొట్టి దొరికేసిన రకుల్!

By Udayavani DhuliFirst Published Nov 20, 2018, 2:09 PM IST
Highlights

దక్షినాది స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమెకి బాలీవుడ్ నుండి అవకాశాలు రావడం విశేషం. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది.

దక్షినాది స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమెకి బాలీవుడ్ నుండి అవకాశాలు రావడం విశేషం. 

ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో రకుల్ ఓ ఫోటోని పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో తన క్లీవేజ్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ఫోటో చూసిన వెంటనే ఇదివరకే ఇలాంటి స్టిల్ లో ఓ నటి ఫోజ్ చేసినట్లు గుర్తుకురావడం ఖాయం.

దీంతో ఆ హీరోయిన్ ఎవరని గుర్తుకు తెచ్చుకొని మరీ ఆమె ఫోటోలను షేర్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆ బ్యూటీ మరెవరో కాదు.. దిశా పటాని. తెలుగులో 'లోఫర్' సినిమాలో నటించిన దిశా.. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

కొద్దిరోజుల క్రితం దిశా తన పోర్ట్ఫోలియో కోసంఎలాంటి బట్టలు వేసుకొని ఫోటోలు దిగిందో.. సరిగ్గా అటువంటి కాస్ట్యూమ్స్ వేసుకొని దిశా మాదిరి ఫోటోకి ఫోజిచ్చింది రకుల్. దీంతో సోషల్ మీడియాలో రకుల్ పై సెటైర్లు వేస్తున్నారు. దిశాని ఇమిటేట్ చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.  

Beauty begins a the moment you decide to be yourself ❤️ pic.twitter.com/SX81awdIqC

— Rakul Preet (@Rakulpreet)
click me!