అన్నయ్య కోసం ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్!

By Udayavani DhuliFirst Published Nov 20, 2018, 12:43 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు వరుసగా ఫ్లాప్ లు అందుకున్నాడు. ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ మీద దూకుడు ప్రదర్శిస్తున్నాడు. కానీ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం టాలీవుడ్ లో ఉన్న కాంపిటిషన్ ముందు తేలిపోతున్నాడు. మధ్యలో ఒకటి అర సక్సెస్ లు వచ్చినా.. సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయాడు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు వరుసగా ఫ్లాప్ లు అందుకున్నాడు. ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ మీద దూకుడు ప్రదర్శిస్తున్నాడు. కానీ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం టాలీవుడ్ లో ఉన్న కాంపిటిషన్ ముందు తేలిపోతున్నాడు.

మధ్యలో ఒకటి అర సక్సెస్ లు వచ్చినా.. సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయాడు. తన అన్నయ్యకి హిట్ రావడం కోసం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తో ఎన్టీఆర్ కి మంచి రిలేషన్ ఉంది. వారి బ్యానర్ లో 'జనతా గ్యారేజ్' సినిమా చేశాడు.

ఇప్పుడు తన అన్నయ్య కోసం మైత్రి మూవీస్ వారిని ఓ సినిమా చేయమని అడిగాడట ఎన్టీఆర్. దీంతో వారు కూడా కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారట. 
ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అన్నయ్యకి సక్సెస్ రావాలని ఎన్టీఆర్ చేస్తోన్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి! 

click me!