బెల్లంకొండకి అంత సీన్ ఉందా..?

By AN TeluguFirst Published Jun 18, 2019, 10:30 AM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో శాటిలైట్ బిజినెస్ కీలకంగా మారింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రూపంలో నిర్మాతలకు భారీ మొత్తం అందుతోంది.

సినిమా ఇండస్ట్రీలో శాటిలైట్ బిజినెస్ కీలకంగా మారింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రూపంలో నిర్మాతలకు భారీ మొత్తం అందుతోంది. సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా.. శాటిలైట్ రూపంలో సగం మొత్తం వచ్చేస్తుంది. అయితే హీరోలందరికీ ఈ మార్కెట్ ఉండదనే చెప్పాలి.

కాస్త క్రేజ్ ఉన్న హీరోలకు, క్రేజీ కాంబినేషన్ సినిమాలకు మాత్రం శాటిలైట్ బిజినెస్ బాగా జరుగుతోంది. కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కూడా శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో మంచి మొత్తం వస్తోంది. గతంలో బెల్లంకొండ నటించిన 'జయ జానకి నాయక', 'కవచం', 'సాక్ష్యం' వంటి సినిమాలకు శాటిలైట్ రూపంలో భారీ మొత్తం లభించింది. 

'కవచం', 'సాక్ష్యం' చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ ఇంపాక్ట్ శాటిలైట్ రైట్స్ పై పడలేదు. తాజాగా బెల్లంకొండ నటిస్తోన్న 'రాక్షసుడు' సినిమాకి కూడా డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం ఆఫర్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా విడుదలకు ముందే హిందీ డబ్బింగ్, తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడిపోయాయి. ఈ రెండింటి రూపంలో దాదాపు రూ.18కోట్లు వచ్చాయని చిత్రబృందం చెబుతోంది.

బెల్లంకొండకి ఉన్న మార్కెట్ ని బట్టి చూస్తే రూ.18 కోట్లు అనేది పెద్ద మొత్తమే.. హైప్ కోసం నిర్మాతలు ఇలా ఎక్కువ నెంబర్లు చెబుతున్నారా..? లేక నిజంగా బెల్లంకొండకి అంత సీన్ ఉందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల యూట్యూబ్ లో బెల్లంకొండ నటించిన 'కవచం' హిందీ డబ్బింగ్ చేసి విడుదల చేస్తే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని 'రాక్షసుడు' సినిమా డబ్బింగ్ రైట్స్ కి ఈ స్థాయిలో మొత్తాన్ని వెచ్చించి ఉంటారని టాక్.  
 

click me!