క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్య కి ‘మల్లేశం’నిర్మాత సాహసోపేత నిర్ణయం

By AN TeluguFirst Published Jun 18, 2019, 10:07 AM IST
Highlights

‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌ సంఘటనలను హీరోయిన్లు బయటకు చెబుతూనే ఉన్నారు. 

 

‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌ సంఘటనలను హీరోయిన్లు బయటకు చెబుతూనే ఉన్నారు. ఈ క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలతో కొందరు నటులకు, వాళ్లను పెట్టుకున్న సినిమాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రీసెంట్ గా హిందీలో దేదే ప్యార్ దే సినిమాకు ఇలా రిలీజ్ సమస్య వచ్చింది. అంతేకాదు రిలీజ్ తర్వాత ఎప్పుడైనా ఫలానా సినిమా చేసేటప్పుడు నేను క్యాస్టింగ్ కౌచ్ కు గురి అయ్యా అని చెప్తే ..ఆ దర్శకుడు, నిర్మాత అంతా మీడియా ముందుకు రావాల్సిన పరిస్దితి వస్తోంది. ఇవన్నీ గమనించిన మల్లేశం నిర్మాత ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.  తన సినిమా విషయంలో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడటం కోసం ఓ డేరింగ్ స్టెప్ ముందుకేసారు.

సినిమా ప్రారంభానికి ముందే ఆయన యూనిట్ సభ్యుల్లో కానీ, నటీనటుల్లో కానీ ఎవరైనా సరే లైంగిక వేధింపుల ఆరోపణల్ని ఎదుర్కొంటే వారు తక్షణమే ప్రాజెక్ట్ నుండి బయటకి వెళ్లిపోవాలని చెప్పారు. అంతేకాదు   వారు బయిటకు వెళ్లటం మూలాన కలిగే నష్టాన్ని సైతం భర్తీ చేయవలసి ఉంటుదని ఖచ్చితంగా చెప్పి కాంట్రాక్ట్ చేయించుకున్నారని సమాచాచరం.ఈ నిర్మాత నిర్ణయాన్ని పరిశ్రమలోని పలువురు అభినందిస్తున్నారు. అలాగే మరికొందరు అనుసరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.   ‘మల్లేశం’ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది.

 నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి టైటిల్‌ రోల్‌ చేశారు. రాజ్‌. ఆర్‌ దర్శకత్వంలో రాజ్‌. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు.  

చేనేత కార్మికుడైన మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? అవమానాల నుంచి పద్మశ్రీ వరకు ఎలా ఎదిగారు?చేనేత రంగంలో అతడు సాధించిన ఘనత ఏమిటి? అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చీర‌ల‌ను నేచి ప్రపంచాన్ని ఎలా అబ్బుర పరిచారు? అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనే విషయాలు ఫోకస్ చేస్తూ సినిమా సాగుతుంది. అచ్చమైన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

click me!