సినిమా ఫ్లాఫ్...చనిపోదామనుకున్న స్టార్ డైరెక్టర్!

By Surya PrakashFirst Published Jul 29, 2021, 12:18 PM IST
Highlights

 బాలీవుడ్ లో ఆయనకంటూ ఓ చరిత్ర ఉంది. అయితే అంతటి గొప్ప దర్శకుడు ఓ టైమ్ లో ఆత్మహత్యా ప్రయత్నం చేద్దామనుకున్నారు. 

బాలీవుడ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌ ఫర్హాన్‌ అక్తర్‌, మ్రునాల్‌ థాకూర్‌ జోడిగా నటించిన ‘తూఫాన్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో రీసెంట్ గా స్ట్రీమ్ అయ్యింది.  ఈ చిత్రం కు నెగిటివ్ రివ్యూలు వచ్చినా బాగానే రెస్పాన్స్ వచ్చింది. జనం చూసారు. ఓ రకంగా ఇది హిట్ సినిమానే. ఈ సినిమా దర్శకుడుగా  రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాకు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో ఆయనకంటూ ఓ చరిత్ర ఉంది. అయితే అంతటి గొప్ప దర్శకుడు ఓ టైమ్ లో ఆత్మహత్యా ప్రయత్నం చేద్దామనుకున్నారు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. అదీ ఓ సినిమా డిజాస్టర్ అయితే. ఆ వివరాలు చూద్దాం. 

2009 పిభ్రవరి 20న దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా రూపొందించిన ‘ఢిల్లీ 6’ అనే సినిమా విడుదలైంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా రిజల్ట్ చూసి దర్శకుడు ఓం ప్రకాష్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట. ఈ విషయాలను తన ఆటోబయోగ్రఫీ ‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’  అనే పుస్తకంలో ప్రస్తావించాడు. ‘ఢిల్లీ 6’ సినిమా ప్లాప్ అవడంతో ఎంతో బాధపడ్డానని పేర్కొన్నాడు.

ఆ సినిమా థియేటర్లో షో నడుస్తున్నప్పుడు జనాలు మధ్యలోనే లేచి వెళ్లిపోయేవారని.. కొన్నిరోజుల తరువాత తనను చంపుతామని బెదిరింపులు కూడా వచ్చినట్లు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెలిపాడు. దీంతో డార్క్ ప్లేస్ లోకి వెళ్లిపోయానని.. బాధను తట్టుకోలేక తాగుడుకి బానిసైనట్లు తెలిపాడు. చచ్చేవరకు తాగి శాశ్వత నిద్రలోకి జారుకోవాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తన బిహేవియర్ కారణంగా భార్య భారతి, కూతురు భైరవిలను ఇబ్బంది పెట్టానని.. తన కొడుకుతో దూరం పెరిగిందని తన బాధలను గుర్తుచేసుకున్నాడు. చివరకు తన భార్య సహకారంతోనే మామూలు మనిషి అయినట్లు చెప్పుకొచ్చాడు.

కోలుకున్న తరువాత ఆరునెలలకు..ఓ రోజు తన సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రధాన్ ని పిలిచాను అన్నారు. అతను వచ్చాక థియోటర్ లో రిలీజ్ చేసిన వెర్షన్ ని మార్చామని, అభిషేక్ బచ్చన్ చనిపోవటం అనేది తాము తీసేసి, ఓ ఆశను కలిపామని అన్నారు. తన భార్య భారతి సహకారంతో స్క్రిప్టులో మార్పులు చేసామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వెనీస్ ఫెస్టివల్ లో చేసిన మార్పులతో షూట్ చేసి, సబ్మిట్ చేసే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని అన్నారు. ఆ తర్వాత డిల్లీ -6 రెండు నేషనల్ ఆవార్డ్ లు పొందిందని గర్వంగా చెప్పారు. 

ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన ‘రంగ్ దే బసంతి’, ‘భాగ్ మిల్కా భాగ్’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా ఫర్హాన్ అక్తర్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘తుఫాన్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. తుఫాన్‌ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్‌ క్యారెక్టర్‌. ప్రియురాలు మ్రునాల్‌ ప్రోత్సాహంతో బాక్సింగ్‌ ఛాంపియన్‌గా మారతాడు.  

click me!