'గుంటూరు మిర్చి'గా బిగ్ బాస్ మెహబూబ్ లుక్!

Published : Jul 29, 2021, 11:42 AM IST
'గుంటూరు మిర్చి'గా బిగ్ బాస్ మెహబూబ్ లుక్!

సారాంశం

గుంటూరు మిర్చి టైటిల్ తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ నుండి మెహబూబ్ లుక్ విడుదల చేశారు. జేబులో ఐడి కార్డుతో ఐటీ ఎంప్లాయ్ లుక్ లో ఉన్న మెహబూబ్, పల్లెటూరిలో భుజంపై నాగలి మోస్తూ వెళ్లడం ఆసక్తి రేపుతోంది.   


యూట్యూబర్ దిల్ సే మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని పాప్యులర్ అయ్యారు. సోహైల్ మిత్రుడిగా హౌస్ లో కొనసాగిన మెహబూబ్,  ఫైనల్ కి చేరుకోకున్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా  ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఫైనల్ కి చేరకుండానే రూ. 10లక్షల ప్రైజ్ మని చిరు, నాగ్ ల ద్వారా పొందాడు మెహబూబ్.  అదే సమయంలో ఫైనల్ కి ముందు హౌస్ లో ఉన్నవారిని కలవడానికి వెళ్లిన మెహబూబ్ ఫ్రెండ్ సోహైల్ కి హింట్ ఇచ్చాడని, అందుకే నాగ్ ఆఫర్ చేసిన మనీ తీసుకొని, సోహైల్ ఫైనల్ లో పోటీ నుండి తప్పుకున్నాడన్న ఆరోపణలు వినిపించాయి. 


ఇక బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో తన యూట్యూబ్ ఛానల్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన చేస్తున్న వీడియోస్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. తాజాగా మెహబూబ్ హీరోగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. గుంటూరు మిర్చి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సిరీస్ నుండి మెహబూబ్ లుక్ విడుదల చేశారు. జేబులో ఐడి కార్డుతో ఐటీ ఎంప్లాయ్ లుక్ లో ఉన్న మెహబూబ్, పల్లెటూరిలో భుజంపై నాగలి మోస్తూ వెళ్లడం ఆసక్తి రేపుతోంది. 


దర్శకుడు అనిల్ విశ్వాన్త్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తుండగా, ప్రణవి మనుకొండ, రితిక చక్రవర్తి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గుంటూరు మిర్చి వెబ్ సిరీస్ కి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మరో వైపు సోహైల్ ఓ చిత్రంలో నటిస్తుండగా, అఖిల్ మోనాల్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా