
రాకేష్ మాస్టర్ మరణం అనంతరం ఆయన గొప్పతనం వెలుగులోకి వస్తుంది. ఆయన శిష్యులు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ దశదిన కర్మ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో రాకేష్ మాస్టర్ ఆప్యాయంగా మామయ్య అని పిలుచుకునే ఓ పెద్దాయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ నాది స్టంట్ డిపార్ట్మెంట్. చెన్నైలో కార్డు ఉండేది. మాది విజయవాడ. శేఖర్ మాస్టర్ ఇల్లు మా ఇంటి పక్కనే ఉండేది. శేఖర్ కి డాన్స్ అంటే ఇష్టం ఎవరి దగ్గరైనా చేర్పించండని వాళ్ళ మామయ్య అడిగితే... ముక్కు రాజు మాస్టర్ దగ్గర తీసుకెళ్ళాను.
ముక్కు రాజు వద్ద శిక్షకుడిగా ఉన్న రాకేష్ మాస్టర్ తో అప్పుడే పరిచయమైంది. శేఖర్ నేను రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకుంటాను అన్నాడు. నేను వేరే డిపార్ట్మెంట్ అయినా రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ లతో అనుబంధం ఏర్పడింది. వాళ్ళు నన్ను మామయ్య అని పిలిచేవాళ్ళు. నిలువ నీడ లేక ఇబ్బంది పడ్డాము.శేఖర్ డాన్స్ ట్యూషన్స్ ద్వారా వచ్చిన డబ్బు, రాకేష్ సినిమాలకు పని చేస్తే వచ్చిన డబ్బులు తెచ్చి నాకు ఇచ్చేవారు.
ఆ డబ్బులు దాచి బోరబండలో ఒక ఇల్లు కొన్నాను. ఆ ఇల్లు ఎవరిదీ? ఎవరెవరికి వాటాలు? అని ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత ఎవరి దారులు వారివి అయ్యాయి. నేను విజయవాడ వెళ్ళిపోయాను. నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను మామయ్య అని రాకేష్ మాస్టర్ అనే వాడు. తన యూట్యూబ్ ఛానల్ లో వాటా తీసుకొని అని ఖాళీ బాండ్ పేపర్ నాకు ఇచ్చాడు. దాని మీద నీకు ఇష్టం వచ్చింది రాసుకో అన్నాడు.
నువ్వు ముందు పోతే నీ కుటుంబాన్ని నేను చూసుకుంటా, ఒకవేళ నేను ముందు పోతే ఈ ఛానల్ లో వాటా తీసుకో, ఛానల్ ద్వారా వచ్చే ఆదాయం నీది, అన్నాడు. నాకు ఆస్తులు అవసరం లేదు. కొడుకులా చూసుకునే రాకేష్ మాస్టరే పోయాడు. ఈ ఆస్తి నాకు వద్దు. రాకేష్ మాస్టర్ సంపాదించింది ఆయన కుటుంబానికి చెందితే చాలు. అందరి ముందు ఈ బాండ్ పేపర్ చించేస్తున్నా అంటూ... ఆయన రాకేష్ మాస్టర్ ఇచ్చిన పత్రాలు చించేశారు. కేవలం తనతో జర్నీ చేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని తనకు ఆధారం కావాలని రాకేష్ మాస్టర్ చూశాడు.