క్రేజీ న్యూస్.. ‘బోయపాటిరాపో’తో పాటు ఓకే రోజు థియేటర్లోకి మరో రెండు సినిమాలు? ఏంటవి?

By Asianet News  |  First Published Jun 30, 2023, 2:21 PM IST

ఈ ఏడాది సెప్టెంబర్ లో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే మోస్ట్ అవైటెడ్ గా మూడు చిత్రాలు ఓకే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలుస్తోంది. ఈ క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..
 


మూవీ లవర్స్ కు ఈ ఏడాది ఫుల్ మీల్స్ ను అందించే సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ప్రారంభంలో  మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో, బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో అలరించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘ఆదిపురుష్’ కూడా విడుదలైంది. ఇక నిన్న డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్పై’ థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. 

అయితే, ఇండస్ట్రీలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒక్కరోజే మూడు అవైటెడ్ చిత్రాలు విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకే డేట్ ను లాక్ చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఇదే నిజమైతే మూవీ లవర్స్ పండగనే చెప్పాలి. ఇంతకీ ఆ మూడు చిత్రాలు ఏంటనే విషయానికొస్తే... ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni)  - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Boyapati Rapo రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. అయితే తొలుత దసరా కానుగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

Latest Videos

దసరా బరిలో మరిన్ని బిగ్ ప్రాజెక్ట్స్ ఉండటంతో నెల ముందుగానే థియేటర్లలో సందడి చేయబోతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘బోయపాటిరాపో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదేరోజున Tiilu Square కూడా విడుదల కాబోతోంది. Dj Tilluకు సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మార్చిలోనే రావాల్సింది. కానీ కాస్తా ఆలస్యంగా సెప్టెంబర్ లో విడుదలకు ప్లాన్ చేశారు. అదీ కూడా ‘బోయపాటిరాపో’కు పోటీగా ఈ చిత్రం సెప్టెంబర్ 15నే థియేటర్లలోకి రాబోతోంది.  సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. 

మరోవైపు చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. చంద్రముఖికి సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఈ సీక్వెల్ రావాల్సింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిన్న ఈ చిత్రం రిలీజ్ పైన మేకర్స్  అఫీషియల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వినాయక చవితి కానుకగా విడుదల కానుందని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 15నే విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారని అంటున్నారు. ఇదే నిజమైతే ఓకే రోజు ‘బోయపాటిరాపో’, ‘టిల్లు స్క్వేర్’, ‘చంద్రముఖి 2’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ కూడా రిలీజ్ కానుండటంతో ఆ నెలంతా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అని చెప్పొచ్చు. 

click me!