ఏఆర్‌ రెహ్మాన్‌కి హైకోర్ట్ లో ఊరట.. పిటిషన్‌ కొట్టివేత

Published : Jul 25, 2021, 08:39 PM IST
ఏఆర్‌ రెహ్మాన్‌కి హైకోర్ట్ లో ఊరట.. పిటిషన్‌ కొట్టివేత

సారాంశం

సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహ్మాన్‌కి వ్యతిరేకంగా నమోదైన పిటిషన్‌ని మద్రాస్‌ హైకోర్ట్ తాజాగా కొట్టేసింది. దీంతో రెహ్మాన్‌కి ఊరట లభించింది.

ప్రముఖ లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌కి మద్రాస్‌ హైకోర్ట్ లో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ని కోర్ట్ కొట్టేసింది. సరైన ఆధారాలు లేవని పిటిషన్‌ని కొట్టేసింది. అసలేం జరిగిందంటే.. 2000లో ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాలియప్పన్‌ ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఈవెంట్‌కి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. ఈ ఈవెంట్‌ కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా రాలేదని, రెహ్మాన్‌ మాత్రం లబ్ది పొందారని కాలియప్పన్‌ మద్రాస్‌ హైకోర్ట్ లో గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికిగానూ ఆయన మూడు కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఈ కేసుని శుక్రవారం న్యాయమూర్తి ఆర్‌ సుబ్రమణియం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకి ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్‌ తరఫు లాయర్‌ పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకి ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానానికి వివరించారు. అయితే దీనిపై పిటిషన్‌ తరఫు న్యాయవాది సరైన వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి ఈ కేసుని కొట్టేశారు. దీంతో రెహ్మాన్‌కి ఊరట లభించింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Arunachalam Movie: రజినీ ఒక్క మాటతో ఓకే.. అరుణాచలం టైటిల్ వెనుక ఇంత కథ ఉందా? సుందర్ సి సీక్రెట్స్!
అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ కి అంతా సిద్ధం, గ్రాండ్ గా ఏర్పాట్లు.. ఎంట్రీ టైమింగ్స్, పార్కింగ్ డీటెయిల్స్ ఇవిగో