ఆరు నెలలు లైంగికంగా వేధించారు.. స్టార్ డైరెక్టర్ పై ఆరోపణలు!

By Udayavani DhuliFirst Published Jan 14, 2019, 10:25 AM IST
Highlights

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. అగ్ర దర్శకులు, నిర్మాతలు, నటులు ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై లైంగిక ఆరోపణలు రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది.

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. అగ్ర దర్శకులు, నిర్మాతలు, నటులు ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై లైంగిక ఆరోపణలు రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. 3 ఇడియట్స్, సంజు లాంటి పెద్ద పెద్ద సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ హిరానీకి మంచి పేరుంది.

అగ్ర హీరోలు ఆయనతో కలిసి పని చేయాలని తాపత్రయ పడుతుంటారు. అటువంటి డైరెక్టర్ పై ఓ మహిళా సహాయక దర్శకురాలు లైంగిక ఆరోపణలు చేస్తోంది. 'సంజు' సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేసిన ఆమెపై పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 2018 మార్చి నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో హిరానీ లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది.

ఈ ఘటన గురించి ఆమె 'సంజు' చిత్ర నిర్మాత విధూవినోద్ చోప్రాకి, హిరానీ భార్యకి ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. ఆ మెయిల్ లో ఏమని రాసుందంటే.. ''హిరానీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం అతడి వద్ద పని చేస్తున్న అసిస్టెంట్ ని.. నా పట్ల జరిగింది చాలా పెద్ద తప్పు. ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనని భయం. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగం మానలేక సైలెంట్‌గా ఉండిపోయాను'' అంటూ తెలిపింది.

అయితే ఈ ఆరోపణలను హిరానీ ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది హిరానీపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, ఆయనపై కావాలనే ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.  

click me!