ఎనిమిదేళ్ల త‌ర్వాత రజినీ ఫ్యాన్స్ మీట్

Published : May 11, 2017, 05:27 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఎనిమిదేళ్ల త‌ర్వాత రజినీ ఫ్యాన్స్ మీట్

సారాంశం

ఎనిమిదేళ్ల తర్వాత అభిమానులతో ముచ్చటించేందుకు  టైం కేటాయించిన రజినీ మే 15 నుంచి 19వ తారీఖు వరకూ అభిమాన సంఘాల వ్యక్తులతో పలు దఫాలుగా భేటీ కానున్న సూప‌ర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉందని టాక్


 
ఇప్పుడు అభిమానులను కలిసేందుకు రజినీ నిర్ణయించారు. శంకర్ రూపొందించిన శివాజీ మూవీ సక్సెస్ తర్వాత రజినీ ఇలా ఫ్యాన్స్ ను కలిశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ఫ్యాన్స్ మీట్ లు జరగలేదు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత అభిమానులతో ముచ్చటించేందుకు రజినీ టైం కేటాయించారు.

 మే 15 నుంచి 19వ తారీఖు వరకూ అభిమాన సంఘాల వ్యక్తులతో పలు దఫాలుగా భేటీ కానున్నారు రజినీ. వీటిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు కానీ.. జస్ట్ ఫోటో సెషన్స్ కు మాత్రమే అనేది పైకి చెప్పే మాట.నిజానికి గత నెలలోనే ఇలా ఫ్యాన్స్ మీట్ అంటూ రజినీ ఫ్యాన్స్ కు పిలుపులు అందాయి.

 కానీ వీటిని ఎందుకనో అప్పుడు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నెల రోజుల్లోనే ఫ్యాన్స్ మీట్స్ ఏర్పాటు చేయడం.. అది కూడా ఐదు రోజులు కేటాయించడం చూస్తే.. ఏదో పెద్ద డెసిషన్ పై మంతనాలు జరిపేందుకే అనుకుంటున్నారంతా. బహుశా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉందని టాక్.

PREV
click me!

Recommended Stories

Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు