కన్నడ యంగ్ హీరోకి సర్ ప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీ కాంత్, ఏం చేశారంటే..?

By Mahesh JujjuriFirst Published Jun 23, 2022, 2:20 PM IST
Highlights

కన్నడ హీరో రక్షిత్ శెట్టికి, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా రక్షిత్ శెట్టి సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇంతకీ సూపర్ స్టార్ ఇచ్చిన సర్ ప్రైజ్ ఏంటీ..? 
 

కన్నడ యంగ్ స్టార్ రక్షిత్ శెట్టి చేసిన ప్రయోగానికి స్టార్స్ నుంచి రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఒక పెంపుడు జంతువు గురించి తీసిన సినిమా.. అటు ఫిల్మ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. 

కన్నడ యాక్టర్‌ రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ప్రయోగాత్మక మూవీ 777 చార్లీ. సంగీత శ్రింగేరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమానికి కె. కిరణ్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్‌ చేశాడు. జూన్‌ 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

ఆమధ్య ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అయితే ఒక్కసారిగా ఏడ్చేశాడు. అంతలా మనసులను కదిలించిందీ చిత్రం. తాజాగా 777 చార్లీ సినిమా వీక్షించాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. అంతేకాదు సినిమా బాగుందంటూ తనకు ఫోన్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడట. ఈ విషయాన్ని హీరో రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

 

What an amazing start to the day!☺

Received a call from Rajinikanth sir. He watched last night and has been in awe of the film. He spoke highly of the making quality, the deeper designs of the film, and especially expressed his admiration for the climax and….

— Rakshit Shetty (@rakshitshetty)

 

ఈ రోజు ఎంతో గొప్పగా మొదలైంది. రజనీకాంత్‌ సర్‌ ఫోన్‌ చేశారు. నిన్న రాత్రి 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు. సినిమాను అంత క్వాలిటీగా, ఎంతో లోతుగా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్‌ తెరకెక్కించిన విధానం, ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్‌ సర్‌' అని ట్వీట్‌ చేశాడు.

click me!