రజనీ `హుకుం` జారీ.. `జైలర్‌` రెండో పాట విడుదల‌ చేసిన వెంకీమామ

Published : Jul 30, 2023, 12:12 PM IST
రజనీ `హుకుం` జారీ.. `జైలర్‌` రెండో పాట విడుదల‌ చేసిన వెంకీమామ

సారాంశం

ఇప్పుడు రెండో పాటని విడుదల చేశారు. `హుకుమ్‌` అంటూ సాగే ఈ సెకండ్‌ సాంగ్‌ తెలుగు వర్షన్‌ పాటని విక్టరీ వెంకటేష్‌ లాంచ్‌ చేయడం విశేషం. 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం `జైలర్‌` చిత్రంలో నటించారు. ఇది మరో పది రోజుల్లో రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో దూసుకుపెంచింది యూనిట్‌. ఇప్పటికీ మొదటి పాట విడుదలైంది. `కావాలయ్యా` అంటూ సాగే పాట దుమ్ములేపింది. హీరోయిన్‌ తమన్నా ఇందులో నర్తించడం హైలైట్‌గా నిలిచింది. మొదట నెగటివ్‌ టాక్‌ వచ్చినా, తమన్నా అందాలు, ఆమె కొత్త గెటప్‌, ఆమె ఊరమాస్‌ డాన్సు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అది ట్రెండింగ్‌ కావడమే కాదు, రీల్స్ తోనూ అదరగొడుతుంది. 

ఇక ఇప్పుడు రెండో పాటని విడుదల చేశారు. `హుకుమ్‌` అంటూ సాగే ఈ సెకండ్‌ సాంగ్‌ తెలుగు వర్షన్‌ పాటని విక్టరీ వెంకటేష్‌ లాంచ్‌ చేయడం విశేషం. ఇందులో రజనీకాంత్‌ జైలర్‌గా నటిస్తున్నారు. ఆయన విలన్లని హెచ్చరిస్తూ హుకుమ్‌ జారీ చేస్తున్న సమయంలో ఈ పాట వస్తుంది. రజనీ మార్క్ హీరోయిజాన్ని చాటి చెప్పేలా ఈ పాట సాగింది. ఆయన్ని ఎలివేట్‌ చేసేలా ఈ పాట అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండటం విశేషం. దీంతో ఫ్యాన్స్ ని అదరగొడుతుంది. అదే సమయంలో పాటలో రజనీ పవర్‌ఫుల్‌ క్లిప్స్ అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా కథలో భాగంగా వచ్చే పాట ఇదని అర్థమవుతుంది. 

ఇక నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో `జైలర్‌` చిత్రం రూపొందుతుంది. ఇందులో శివరాజ్‌ కుమార్‌, సునీల్, రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్‌లాల్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ఓ రకంగా ఇదొక పెద్ద మల్టీస్టారర్‌ మూవీ అని చెప్పొచ్చు. కాకపోతే ఆయా స్టార్స్ నిడివి తక్కువగానే ఉండబోతుందట. యాక్షన్‌ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఆయన బాణీలు సినిమాకి ప్లస్ కాబోతున్నాయి. దీనికితోడు రజనీకాంత్ లుక్‌ సైతం సినిమాల్లో ఆకట్టుకుంటుంది. ఆయన చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అదే సమయంలో పవర్‌ఫుల్‌గానూ కనిపిస్తున్నారు. 

సన్‌ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తమన్నా రజనీ సరసన కథానాయికగా నటించింది. తొలిసారి ఈ జంట వెండితెరపై మ్యాజిక్‌ చేయబోతుందట. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ మల్టీఫ్లెక్స్ ప్రై లి తెలుగులో రిలీజ్‌ చేస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్