రజినీకాంత్ కి షాక్.. స్టూడెంట్స్ రాళ్ల దాడి!

Published : May 02, 2019, 04:12 PM IST
రజినీకాంత్ కి షాక్.. స్టూడెంట్స్ రాళ్ల దాడి!

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న 'దర్బార్' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. షూటింగ్ మొదలుపెట్టిన రోజే సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న 'దర్బార్' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. షూటింగ్ మొదలుపెట్టిన రోజే సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. అయితే షూటింగ్ కి సంబంధించి ఇటీవల కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

హీరోయిన్ నయనతార ఫోటోలు కూడా బయటకొచ్చాయి. దీంతో దర్శకుడు మురుగదాస్ ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. షూటింగ్ స్పాట్ లో ఎవరూ మొబైల్ ఫోన్స్ వాడకూడదని నిబంధనలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ కాలేజ్ లో జరుగుతోంది. అయితే కాలేజ్ విద్యార్ధులు కొందరు రజినీకాంత్ ని, షూటింగ్ ని చూడడానికి ఎగబడుతున్నారు.

మొబైల్ లో ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తున్నారు. దీంతో చిత్రయూనిట్ వారిపై దురుసుగా ప్రవర్తించింది. దూరంగా వెళ్లిపోమని హెచ్చరించడంతో స్టూడెంట్స్ హర్ట్ అయ్యారు. దీంతో వెంటనే సెట్స్ పై రాళ్లదాడికి దిగారు. నిత్యం విద్యార్ధుల నుండి ఇలాంటి సమస్యలు ఎదురవుతుండడంతో మురుగదాస్ స్వయంగా కాలేజ్ యాజమాన్యంతో చర్చలు జరిపారట.

షూటింగ్ వైపు విద్యార్ధులను రానీయవద్దని, అలా కుదరకపోతే మరో ప్రత్యామ్నాయం చూసుకుంటామని మురుగదాస్ కాలేజీ యాజమాన్యంతో చెప్పినట్లు తెలుస్తోంది. వీలైనంత  త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు  తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్