మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెర్రీనే స్వయంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
‘ఆర్ఆర్ఆర్’తో నాటు నాటుకు ఆస్కార్ దక్కింది. ఆస్కార్ ప్రమోషన్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హాలీవుడ్ మీడియాతో సందడి చేసిన విషయం తెలిసిందే. RRRలో చరణ్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్ల నుంచీ ప్రశంసలు అందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో చరణ్ ప్రాజెక్ట్స్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చరణ్ చేతిలో అఫీషియల్ గా ‘ఆర్సీ15’ మరియు ‘ఆర్సీ16’ చిత్రాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే RC15 చాలా మేరకు షూటింగ్ పూర్తైంది. ఈక్రమంలో RC16 షూటింగ్ ఎప్పుడుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా రామ్ చరణ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్సీ16’పై స్పందించారు. బుచ్చిబాబు - చరణ్ కాంబోలో రానున్న ఈ చిత్రం 2023 సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తామని చెప్పారు.అయితే మూవీలో తన క్యారెక్టరైజేషన్ ‘రంగస్థలం’లోని చిట్టిబాబు తరహాలోనే ఉంటుందని.. అంతకు మించి ఉండబోతుందని అన్నారు. ఈఏడాది జూన్ వరకు ‘ఆర్సీ15’పూర్తి కానుందని, రెండు నెలల గ్యాప్ తర్వాత బుచ్చిబాబు సినిమాలో చరణ్ జాయిన్ కానునున్నట్టు తెలుస్తోంది.
ఏదేమైనా ‘ఆస్కార్స్’ సాధించిన తర్వాత రామ్ చరణ్ ను డీల్ చేయడం దర్శకులకు మహా కష్టతరమైనే చెప్పాలి. పైగా చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకోవడంతో అదే స్థాయిలో ప్రాజెక్ట్ ను తెరకెక్కించాల్సి ఉంటుంది. ‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు రామ్ చరణ్ ను ఎలా ప్రజెంట్ చేస్తారోనన్నది మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కూడా నిర్మాణ భాగస్వామ్యం కానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వ్యాపారవేత్త, నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ లేదా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది. ఇక ‘ఆర్సీ15’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మార్చి 27న టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కాబోతుందని ఇప్పటికే దిల్ రాజ్ ప్రకటించారు.