Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్.. `పుష్ప 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌?

Published : Mar 20, 2023, 04:40 PM ISTUpdated : Mar 20, 2023, 05:12 PM IST
Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్.. `పుష్ప 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌?

సారాంశం

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా భారీ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు దర్శకుడు సుకుమార్‌. `పుష్ప2` నుంచి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కిది రెండో భాగం. మొదటి భాగం పెద్ద విజయం సాధించడంతో రెండో భాగాన్ని భారీ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియాని మించి దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఆ మధ్య వైజాగ్‌లో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

ఇదిలా ఉంటే త్వరలోనే బన్నీ పుట్టిన రోజు రాబోతుంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే `పుష్ప 2`కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో బన్నీ పుట్టిన రోజు సందర్భంగా భారీ సర్‌ప్రైజ్‌ని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అందుకోసం సుకుమార్‌ టీమ్‌ కూడా ఈ సారి గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారట. గూస్‌ బంమ్స్ తెప్పించేలా, ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ ట్రీట్‌ ఇవ్వాలనుకుంటున్నారట. 

అందులో భాగంగా ఓ టీజర్‌ కట్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఇది యాక్షన్‌ టీజర్‌ అని తెలుస్తుంది. దాదాపు మూడు నిమిషాల పాటు ఉండే ఓ యాక్షన్‌ టీజర్‌ని ప్లాన్‌ చేశారట సుకుమార్‌. పూర్తి యాక్షన్‌ సీక్వెన్స్ తో ఈ టీజర్‌ ఉండబోతుందని, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండబోతుందని, అంతేకాదు సినిమాపై అంచనాలను, నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉండబోతుందని సమచారం. ఇప్పటికే ఈ టీజర్‌ కట్‌ పూర్తయ్యిందని, దీనికి పైనల్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ యాడ్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఆ వర్క్  జరుగుతుందని, ఈ నెలాఖరు వరకు ఈ టీజర్‌ పూర్తవుతుందని సమాచారం. 

ఏప్రిల్‌ ఎనిమిది బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ స్పెషల్‌ యాక్షన్‌ టీజర్‌ని విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. వీరితోపాటు అనసూయ, సునీల్‌, రావు రమేస్‌ నటించారు. కొత్తగా రెండో భాగంలో సాయిపల్లవి కీలక పాత్రలో కనిపించబోతుందట. అందుకు డేట్స్ కూడా ఇచ్చిందని సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే