రజనీకాంత్ కు హైదరాబాద్ సెంటిమెంట్, ఆ సినిమా కూడా ఇక్కడేనట...?

Published : Jul 14, 2022, 06:45 AM IST
రజనీకాంత్ కు హైదరాబాద్ సెంటిమెంట్, ఆ సినిమా కూడా ఇక్కడేనట...?

సారాంశం

సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఈమధ్య హైదరాబాద్ సెంటిమెంట్ పెరిగిపోయింది. ఆయన ప్రతీసినిమాను మేజర్ పార్ట్ ఇక్కడే షూటింగ్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. నెక్ట్స్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ నుంచే షురూ చేయబోతున్నాడట.   

తమిళ తలైవా రజనీకాంత్ తన షూటింగ్స్ ఎక్కువగా  హైదరాబాద్ లో ఉండేట్టు చూసుకుంటున్నాడు. హీరోగా ఆయన 169వ సినిమా స్టార్ట్ కాబోతోంది.  సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగు ఎక్కువగా హైదరాబాదులో జరగనుందని సమాచారం. 

హైదరాబాద్ లో షూటింగ్ చేయడం కోసం దేశవ్యాప్తంగా హీరోలు, దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడి వాతావరణం తో పాటు. ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా అందుకు కారణం కావచ్చు. ఒక్కసారి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పెట్టుకుంటే.. ఇక ఎక్కడికీ వెళ్ళే అవసరం లేకుండా.. అక్కడే అంతా సెట్ చేసుకోవచ్చుఅనే అభిప్రాయం ఉందిమేకర్స్ లో. ఇక వాళ్లు కూడ అదే ఫాలో అవుతున్నారు. 

ముక్యంగా రజనీ కాంత్ లాంటి హీరోలకు హైదరాబాద్ షూటింగ్ చాలా కంఫటబుల్ అని చెప్పుకోవచ్చు. నాలగైదు ప్రాంతాలు తిరగకుండా.. ఒకేచోట షూటింగ్ కోసం సెట్ చేసకుని కంప్లీట్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో పాటు హైదరాబాద్ పై ఇష్టంతో రజనీ లాంటి స్టార్స్ ఇక్కడ షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

ఇక రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ సినిమా కోసం హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని భారీ సెట్స్ వేయిస్తున్నారని సమాచారం.  మేజర్ పార్టు షూటింగు ఇక్కడే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చేనెల నుంచి ఈ సెట్స్ లో షూటింగు మొదలవుతుందని ఫిల్మ్ సర్కిల్ లో టాక్.. అంతే కాదు  ఈ సెట్స్ కోసం భారీ బడ్జెట్ నే  ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ మధ్య  కాలంలో రజనీకాంత్  సినిమాల  షూటింగ్స్ అన్నీ హైదరాబాదులో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. పెద్దన్న షూటింగు కూడా ఇక్కడే ఎక్కువ భాగం షూటింగు జరుపుకుంది. ఇక రజనీతో పాటు  అజిత్, విశాల్ బాలీవుడ్ నుంచి సల్మాన్ లాంటి హీరోలు  కూడా హైదరాబాదులో షూటింగు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా