Kavya Maran Wedding: కావ్య మారన్ పెళ్లికి బయల్దేరిన రజనీకాంత్, ఐపీఎల్ ట్రోల్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ ఏమన్నారంటే..

Published : Nov 10, 2026, 07:14 AM IST
Kavya Maran Wedding

సారాంశం

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం గ్రీస్‌లో జరగనుంది. ఈ వేడుకకు రజనీకాంత్, ఎం.కే.స్టాలిన్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. చెన్నైలో నవంబర్ 21న ఘనంగా రిసెప్షన్ జరగనుంది.

ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో ఆమె ఏడు అడుగులు వేయనున్నారు.

పెళ్లి వేడుకలు ఘనంగా మొదలుకానున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సినీ తారలు ఈ పెళ్లికి హాజరయ్యేందుకు చెన్నై నుంచి బయల్దేరారు. ఇక, నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ గ్రాండ్‌గా జరగనుంది.

కావ్య మారన్, అనిరుధ్ పెళ్లికి సెలబ్రిటీల దండే వెళ్తోంది. రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్యతో కలిసి గ్రీస్‌కు బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కూడా గ్రీస్‌కు పయనమయ్యారు. వీరు దుబాయ్ మీదుగా గ్రీస్ చేరుకుంటారని తెలుస్తోంది. నవంబర్ 10, 11 తేదీల్లో వేడుకలు ముగిశాక, నవంబర్ 13న వీరు చెన్నైకి తిరిగి రానున్నారు.

గ్రీస్‌లో జరిగే పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. అతిథుల విమాన ప్రయాణాలు, బస వంటి ఏర్పాట్లను మారన్ కుటుంబం చూసుకుంటోంది. ఇక ఐపీఎల్ మ్యాచుల్లో కావ్య మారన్ రియాక్షన్స్ సన్‌రైజర్స్ అభిమానులకు బాగా తెలుసు. జట్టు గెలిస్తే సంబరాలు, ఓడిపోతే నిరాశ.. ఆమె ముఖంలో కనిపించే భావాలు మీమ్స్‌గా మారుతుంటాయి. దీనిపై కావ్య మాట్లాడుతూ.. నన్ను ట్రోల్ చేయడం సహజమే, నా రియాక్షన్స్ కూడా సహజంగానే ఉంటాయని అన్నారు. ఆఫీసుల్లో షేర్ల ధరలు పెరిగినా, తగ్గినా ఉద్యోగులు రియాక్ట్ అవుతారు, అభిమానులు కూడా స్టేడియంలో ఎమోషనల్ అవుతారు. సన్‌రైజర్స్ జట్టు విషయంలో నా మనసంతా అక్కడే ఉంటుంది, గెలుపోటములు నాపై ప్రభావం చూపుతాయి అని ఆమె అన్నారు.

నవంబర్ 21న రిసెప్షన్

గ్రీస్‌లో పెళ్లి తర్వాత నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. కావ్య తల్లిదండ్రులు, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, కావేరి మారన్ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అక్టోబర్‌లో తెలంగాణ సీఎం కార్యాలయం దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం విజయ్ దళపతి, మాజీ సీఎం ఎం.కే.స్టాలిన్, తదితరులు హాజరుకానున్నారు. అతిథుల పూర్తి జాబితాపై అధికారిక ప్రకటన రాలేదు. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర.. రజనీకాంత్ కుటుంబానికి బంధువు కావడంతో సూపర్ స్టార్ ఫ్యామిలీ కూడాఈ పెళ్లిలో సందడి చేయనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: సుధీర్ సున్నా, ముకేష్ కాదు మబ్బేష్, తన చెంపపై తానే కొట్టుకున్న నీతు, నామినేషన్స్‌లో తారస్థాయికి రచ్చ
Ranabaali OTT Release: రణబాలి ఓటీటీ రిలీజ్.. విజయ్ దేవరకొండ - రష్మికల సినిమా ఎక్కడ చూడొచ్చంటే?