
నయనతార హీరోయిన్గా సుందర్ సి డైరెక్ట్ చేసిన 'మూకుత్తి అమ్మన్ 2 – మహాశక్తి' థియేటర్లలో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ సినిమాలో ఖుష్బూ సుందర్, స్నేహ కూడా ఉన్నారని రివీల్ చేస్తూ, మేకర్స్ దీపావళి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వీళ్లిద్దరూ సినిమాలో మూకుత్తి అమ్మవారి సోదరీమణులుగా మెరుస్తున్నారు.
రిలీజ్ అయిన రెండో రోజే, అంటే శనివారం అన్ని సెంటర్లలోనూ హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలతో పాటు ఎక్స్ట్రా షోలు కూడా పడ్డాయి. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో ద్వారానే 71.75K టికెట్లు అమ్ముడయ్యాయి. బుకింగ్స్ మొదలైనప్పటి నుంచి ప్రతీ గంటకూ 'మూకుత్తి అమ్మన్ 2 – మహాశక్తి' టికెట్ బుకింగ్స్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వేల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారి కె. గణేష్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు సుందర్ సి కథ అందించి, డైరెక్ట్ చేశారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఇచ్చారు. ఖుష్బూ సుందర్, కుష్మిత గణేష్, ఇషాన్ సక్సేనా, విఘ్నేష్ శివన్ కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
This Diwali, let the divine glory of our beloved Mookuthi Amman illuminate every home. ❤️✨
#MookuthiAmman2
🎟️ https://t.co/muQR2YzuYJ
#Mahasakthi
🎟️ https://t.co/oiLLwcsBAy
A @sundarcoffl Spectacle 🔥
#MookuthiAmman2FromToday
#MahasakthiFromToday
@IshariKGanesh @VelsFilmIntl #Nayanthara #VigneshShivan @khushsundar @AvniCinemax_ @Rowdy_Pictures @kushmithaganesh #AnanditaSundar @hiphoptamizha @gopiamar @FennyOliver @ReginaCassandra @iYogiBabu @suneeltollywood @Officialsalaga @mgabhinaya @Venkatt_Ragavan @vichuviswanath @Inban_U @teamaimpr @redgiantmovies_ @Ayngaran_offl @BigfilmsLtd @BhavanaRelease @AAFilmsIndia @asianet @velsmusicintl @vijaytelevision @JioHotstar @kav_pandian @thetabsofficial
— Vels Film International (@VelsFilmIntl) November 8, 2026
నయనతారతో పాటు దునియా విజయ్, రెజీనా కసాండ్రా, ఊర్వశి, యోగి బాబు, మైనా నందిని, గరుడ రామ్, అభినయ, శృతి ఎస్., సింగంపులి అణ్ణావి, వి.ఆర్. స్వామినాథన్, శివకుమార్ ఎస్., సునీల్ వర్మ ఇందుకూరి, వర్షిణి వెంకట్, పాలా కరుప్పయ్య, ఆనంద అధిష్ట లక్ష్మి, నితిన్ సత్య, దేబ్లీనా చక్రవర్తి ఈ 'మహాశక్తి'లో కీలక పాత్రలు పోషించారు. భావన రిలీజ్ సంస్థ ఈ చిత్రాన్ని కేరళ థియేటర్లలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. మార్కెటింగ్: సినీ కనెక్ట్ కమ్యూనికేషన్స్, పీఆర్ఓ: ప్రతీష్ శేఖర్.