రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కాలా న్యూ లుక్

Published : Dec 12, 2017, 01:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా కాలా న్యూ లుక్

సారాంశం

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కాలా పా రింజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజినీ మూవీ రజినీ పుట్టినరోజు సందర్భంగా కాలా న్యూ లుక్ పోస్టర్ విడుదల

సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఆయన హీరోగా వస్తున్న కొత్త సినిమా 'కాలా' నుండి సెకండ్ లుక్ బయటకు వదిలింది చిత్రయూనిట్. గడ్డంతో కళ్ళజోడు పెట్టుకొని ఎంతో సీరియస్‌గా ఈ లుక్‌లో రజినీ దర్శనమిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌ లుక్ విడుదలచేశారు. అందులో రజినీ థార్ జీపుపై కూర్చొని స్టైల్‌గా కనిపించారు. ఈ రెండు లుక్స్ ఆకట్టుకునేలా ఎంతో డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే తపన ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోయింది.

 

వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రజినీ అల్లుడు ధనుష్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2018 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.0 ' కూడా 2018 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

PREV
click me!

Recommended Stories

Aamir Khan: నా సికందర్ నువ్వే.. మాజీ భార్య స్పెషల్ విషెస్! 'లగాన్' కథ విననని చెప్పాడట
Ananya Panday: అతడి కోసం నన్ను నేను తగ్గించుకున్నా.. బ్రేకప్స్ పై నోరు విప్పిన అనన్య పాండే!