రజనీ 'జైలర్' ఆ హాలీవుడ్ చిత్రం కాపీనా?

Published : Aug 03, 2023, 08:38 AM IST
 రజనీ 'జైలర్' ఆ హాలీవుడ్ చిత్రం కాపీనా?

సారాంశం

  తన పోలీస్ కొడుకు, స్కూలు మనవడు షూ పాలీష్ చేస్తూ మొదట కనిపించిన రజనీ.. ఆ తర్వాత దడేల్​ పులిలా మారుతారంటూ యాక్షన్ మోడ్‍లోకి వెళ్లిపోయారు.


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “జైలర్” ఈ నెల 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రమోషన్స్ మొదలెట్టారు. ఈ సందర్భంగా మూవీటీమ్​ 'షోకేస్‌' పేరిట ఓ ట్రైలర్‌ను గ్రాండ్​గా రిలీజ్​ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది.  అలాగే ట్రైలర్ గమనిస్తే రజినీకాంత్ సాదాసీదా జీవితాన్ని గడిపే రిటైరైన వ్యక్తి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆయనతో పెట్టుకున్న వారి భరతం పట్టేందుకు ఎంత దూరమైన వెళ్ళే పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పారు. ట్రైలర్, రజినీకాంత్ గెటప్ అదిరింది. అయితే అదే సమయంలో ఈ చిత్రం ఓ హాలీవుడ్ చిత్రం నుంచి లేపారనే ప్రచారం మొదలైంది. ఆ సినిమా ఏమిటి?

Nobody (2021) చిత్రం కథ కూడా ఓ నార్మల్ లైఫ్ పెళ్లాం,బిడ్డలతో నడుపుతూండే ఓ వ్యక్తి అనుకోని పరిస్దితుల్లో రష్యన్ మాఫియాతో తలపడాల్సి వస్తుంది. అతను నో బడీ అనుకున్న వాళ్లకు షాక్ ఇచ్చేలా సినిమా సాగుతుంది.  John Wick కు పనిచేసిన టీమ్ ఈ సినిమాకు చేసారు. ఫుల్ యాక్షన్ తో అదిరిపోతుంది. ఈ సినిమానే కొద్దిపాటి మార్పులతో జైలర్ అని చేసారంటూ తమిళనాట ప్రచారం జరుగుతోంది. అయితే ఓ ట్రైలర్ ని చూసి ఫలానా సినిమాని కాపీ కొట్టారనటం మాత్రం సమంజసం మాత్రం కాదు. సినిమా రిలీజ్ తర్వాతే ఇది కాపీనా లేక ఒరిజినల్ స్టోరీనా అన్నది తేలుతుంది.  

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన సినిమా 'జైలర్‌'. హీరోయిన్​ తమన్నా రజనీ సరసన నటించింది. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్ స్టార్ యాక్టర్​ జాకీ ష్రాఫ్‌, సీనియర్ నటి రమ్యకృష్ణ, టాలీవుడ్ విలక్షణ నటుడు సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 10న గ్రాండ్​గా అభిమానుల ముందుకు కానుంది. 

 

ఈ ట్రైలర్ లో ఎప్పటిలాగే రజనీకాంత్ తన మార్క్​ స్టైల్, స్వాగ్​, ఎనర్జీతో అదిరిపోయేలా కనిపించారు. ఆయన డైలాగ్స్​ కూడా అదిరిపోయాయి. "ఈ వ్యాధి వచ్చిన వారు పిల్లిలా ఉంటారు. కానీ ఒక్కసారి దడేల్‍గా పులిలా మారుతారు"అంటూ బ్యాక్​గ్రౌండ్​లో రజినీని ఉద్దేశిస్తూ వచ్చిన డైలాగ్ బాగుంది. తన పోలీస్ కొడుకు, స్కూలు మనవడు షూ పాలీష్ చేస్తూ మొదట కనిపించిన రజనీ.. ఆ తర్వాత దడేల్​ పులిలా మారుతారంటూ యాక్షన్ మోడ్‍లోకి వెళ్లిపోయారు. "ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే" అంటూ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ హైలైట్​గా నిలిచింది. 

ఆ తర్వాత సూపర్ స్టైలిష్​గా యాక్షన్ సీన్లలో కనిపించి దడ పుట్టించారు. వింటేజ్ రజినీ కనిపించారు. ఈ సన్నివేశాలన్నింటికీ సెన్సేషన్ మ్యూజిక్​ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫైనల్​గా 'టైగర్‌గా హుకుం' అంటూ రజినీ డైలాగ్‍తో షోకేస్ ట్రైలర్​ను ముగించారు మేకర్స్​. ఇక టాలీవుడ్​ కమెడియన్ కమ్​ విలన్​ సునీల్​ను కూడా ఓ షాట్​లో చూపించారు. ఇందులో సునీల్​.. ఇన్​కమ్​ ట్యాక్స్​ ఆఫీసర్స్​ వచ్చే ఏమైనా డొనేషన్స్​ కావాలా అంటూ కాస్త డిఫరెంట్​గా కనిపించారు. ​

అలాగే ఈ సినిమాలో హీరోయిన్​గా తమన్నా నటిస్తోంది. రీసెంట్​గా ఆమె చిందులేసిన 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ వచ్చిన సాంగ్​ సోషల్​మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటకు అనిరుధ్‌ స్వరాలు అందించగా, సింధూజ శ్రీనివాసన్‌ దీనిని ఆలపించారు. సన్​ పిక్చర్స్​ సినిమాను నిర్మిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?