
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ టమాటాల రేటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. టమాటాల వల్ల నష్టపోయి.. రోడ్డుమీద పారేసిన రోజుల నుంచి రైతులు.. ప్రస్తుతం ఆ టమాటాలు అమ్ముకుని కోటీశ్వరులు అవుతున్నారు. ఈక్రమంలోనే టమాటాలపై.. వాటి రేటుపై ఎన్నో వీడియోలు..మీమ్స్.. జోకులు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కామన్ నెటిజన్లు.. యూబ్యూబర్లతో పాటు. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా టమాటాల రేట్లపై వారికి తోచిన వీడియోలు వారు చేస్తూ.. ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజాగా తమిళ స్టార్ నటి టాలీవుడ్ లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన టమాటాల బ్యాగ్ ఓదొంగ ఎత్తికెళ్ళిపోయాడంటూ.. వీడియోను శేర్ చేశారు నటి. అక్కడే తన ప్రతిభ చూపించారు వరలక్ష్మీ.. ఈవీడియోలో ఏముందంటే..? వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ రాతి గోడ దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె మరొక అమ్మాయితో డీప్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికే తన దగ్గర ఉన్న ఫోన్ తో పాటు తను కొన్న టమాటాలను కూడా ఆ గోడపై పెట్టి మాట్లాడుతుంటుంది. ఇంతలో అది గమనించిన ఓ దొంగ.. వెనుకనుంచి వచ్చి వరలక్ష్మీ సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లిపోతాడు. ఇది చూసిన మరో అమ్మాయి ఈ విషయాన్ని వరలక్ష్మీకి చెబితే ఫోనే కదా పోతే పోనీ అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది.
ఇక ఆతువాత మళ్లీ ఆ దొంగ వెనకనుంచి వచ్చి.. ఫోన్ అక్కడ పెట్టి..టమాటాల ప్యాక్ ను ఎత్తుకెళ్లిపోతాడు. దాంతో అది చూసిన వరలక్ష్మీ.. ఆమె మాట్లాడుతున్న వ్యక్తి ఇద్దరు కలిసి ఆ దొంగ వెంట పడతారు. అలా టమాటాల విలువ తెలియజేస్తున్నట్టుగా వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మీ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా టమాట ప్రియలను కన్నీరు పెట్టిస్తుంది వాటి ధర. ఎంతో ఇష్టంగా టామాటాలు తినేవారు.. వాటినికొనలేక ఊరకే ఉండాల్సి వస్తోంది. మొన్నటి వరకూ 100 నుంచి 150 వరకూ ఉన్న టమాటా.. రీసెంట్ గా 200 కిలో రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఈ ధరలు ఇలానే ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు టమాటాల కు రేటు లేక రైతులునష్టపోయారు అన్నవార్తలు విన్నా.. రోడ్డుమీద టమాటాలు పారబోసిన రోజులు చూశాం..కాని ఇప్పుడు అదే టమాటాలతో ఒక్కరోజులో కోటీశ్వరులు కూడా అవుతున్నారు రైతులు. అంతే కాదు టమాటాల దోంగతనాలు కూడా పెరిగిపోయాయి.