`జైలర్‌ 2` అప్‌ డేట్‌.. వచ్చేది ఎప్పుడు అంటే?.. ఈ సారి మామూలుగా ఉండదు

Published : Jan 21, 2024, 05:18 PM IST
`జైలర్‌ 2` అప్‌ డేట్‌.. వచ్చేది ఎప్పుడు అంటే?.. ఈ సారి మామూలుగా ఉండదు

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గతేడాది `జైలర్‌` చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ మూవీని అందుకున్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ ప్లాన్‌ జరుగుతుంది. దాని అప్‌ డేట్‌ వచ్చింది. 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చాలా రోజుల తర్వాత హిట్‌ అందుకున్నారు. ఆయనకు `రోబో` తర్వాత చెప్పుకోదగ్గ బ్లాక్‌ బస్టర్‌ లేదు. `కబాలి`, `2.0`, `కాలా` వంటి సినిమాలు యావరేజ్‌గానే ఆడాయి. 13ఏళ్లుగా రజనీ రేంజ్‌ ఇది అని చెప్పుకునే సినిమా రాలేదు. ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో ఏదో ఒక అసంతృప్తి ఉండేది. ఆ లోటుని తీర్చింది `జైలర్‌`. రజనీ కొడితే ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ మూవీ చూపించింది. సూపర్‌ స్టార్‌ దెబ్బని బాక్సాఫీసుకి రుచి చూపించింది. ఈ మూవీ ఆరు వందలకోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 

నెల్సర్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లోని మ్యాజిక్‌, రజనీకాంత్‌ మాస్‌ హంగామా, స్టయిల్‌, ఎలివేషన్లు, తమన్నా అందాలు, సునీల్, యోగిబాబు కామెడీ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాని తిరుగులేని విజయాన్ని అందించాయి. దీనికితోడు శివ రాజ్‌ కుమార్‌ మాస్‌ ఎంట్రీ, మోహన్‌లాల్‌ స్పెషల్‌ మెరుపులు అదరగొట్టాయి. ఆడియెన్స్ ఊగిపోయేలా చేశాయి. ఈ మూవీ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిపింది. 

ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ రాబోతుంది. దర్శకుడు దిలీప్‌ కుమార్‌ ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. `జైలర్‌ 2`పై ఆయన వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం రజనీకాంత్‌.. టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో `వెట్టయాన్‌` మూవీలో నటిస్తున్నారు. ఇది భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది. అమితాబ్‌ బచ్చన్‌, దగ్గుబాటి రానా, ఫహర్‌ ఫాజిల్‌, మంజు వారియర్‌, రితికా సింగ్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో భారీ పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. 

ఈ ఫిబ్రవరిలో రజనీకాంత్‌ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ రూపొందించిన `లాల్‌ సలామ్‌`లో నటించింది. ఇది వచ్చే నెలలో రాబోతుంది. ఆ తర్వాత `వెట్టయాన్‌` మూవీ రానుంది. దీంతోపాటు `విక్రమ్‌`, `లియో` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీ తర్వాత రజనీకాంత్‌, నెల్సన్‌ కాంబినేషన్‌లో మూవీ రానుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే `జైలర్‌` తర్వాత నెల్సన్‌ మరే మూవీని ప్రకటించలేదు. ఈ నెలలోనే ఆయన తన కొత్త ప్రాజెక్ట్ ని రివీల్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్‌తో చేయాల్సిన `జైలర్‌2`ని నెక్ట్స్ లెవల్‌లో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?