బాయ్ ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్న తాప్సి.. ఫోటోలు వైరల్!

By team teluguFirst Published Jul 12, 2021, 8:57 AM IST
Highlights

మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మాథియాస్ తో తాప్సి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఆ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన తాప్సి టీమ్ లో మథియాస్ కూడా ఉన్నారు. అందమైన బీచ్ లలో ఈ జంట ఆనంద వివారం చేసినట్లు తెలిసింది.

హీరోయిన్ తాప్సి పన్ను బాయ్ ఫ్రెండ్ మాథియాస్ బోయే తన 41వ జన్మదినం జరుపుకున్నారు. ఆదివారం జరిగిన ఈ బర్త్ డే వేడుకలలో తాప్సి పన్ను తన సోదరి షాగున్ తో పాటు పాల్గొన్నారు. మాథియాస్ ఈ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. 


తాప్సి పన్ను, షాగున్ లతో పాటు తన మిత్రులతో మాథియాస్ లంచ్ చేస్తున్న ఫోటోను ఆయన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అలాగే ఆ ఫొటోకు ''ది బెస్ట్ కంపెనీ'' అంటూ కామెంట్ పెట్టారు. షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న తాప్సి బాయ్ ఫ్రెండ్ తో కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mathias Boe (@mathias.boe)


మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మాథియాస్ తో తాప్సి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఆ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన తాప్సి టీమ్ లో మథియాస్ కూడా ఉన్నారు. అందమైన బీచ్ లలో ఈ జంట ఆనంద వివారం చేసినట్లు తెలిసింది. తాప్సితో బీచ్ లో ఆహ్లాదంగా గడుపుతున్న ఫోటోలు మాథియాస్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో, వీరి రిలేషన్ పై మరింత అవగాహన వచ్చింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mathias Boe (@mathias.boe)

ఇక తాప్సి ప్రధాన పాత్రలో నటించిన హసీన్ దిల్ రుబా ఓటిటిలో విడుదల కావడం జరిగింది. నటిగా ఫుల్ ఫార్మ్ లో ఉన్న తాప్సి.. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి తొమ్మిది చిత్రాల వరకు చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా రష్మీ రాకెట్ విడుదలకు సిద్ధంగా ఉంది. 

click me!