
సౌత్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రం ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో రజినీకాంత్, నయనతార, జ్యోతిక తదితరులు నటించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రాఘవా లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసి చిత్రం సెట్స్ పైకి వచ్చింది. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్ (Raghava Laurence) తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (RajiniKanth)ను మర్యాద పూర్వకంగా కలిశారు. సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్న సందర్భంగా తలైవా ఆశీర్వాదం తీసుకున్నారు.
‘చంద్రముఖి 2’ కాస్ట్ అండ్ క్రూ సెటప్ ముగియడంతో చిత్ర యూనిట్ షూటింగ్ కు సిద్ధమైంది. తొలి షెడ్యూల్ ను కర్ణాటకలోని మైసూర్ లో చిత్రీకరించనున్నారు. ఇక్కడే 15 రోజుల పాటు రెగ్యూలర్ షూట్ జరగనుందని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభం పట్ల రాఘవా లారెన్స్ నే అఫిషియల్ గా ట్వీటర్ లో అనౌన్స్ చేశారు. రజినీ బ్లెసింగ్స్ తీసుకుంటున్న పిక్స్ నూ పంచుకున్నారు. 2005లో హర్రర్ కామెడీ చిత్రంగా వచ్చిన ‘చంద్రముఖి’ని మించి ఉండేలా కథను తయారు చేసినట్టు తెలుస్తోంది.
సీక్వెల్ లో రజినీకి పాత్రను రాఘవ లారెన్స్ పోషిస్తుండటం పట్ల అభిమానులు ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఇప్పటికే రాఘవా ముని, కాంచన, గంగ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కామెడీని పండించగల కెపాసిటీ ఉన్న నటుడు కావడంతో మేకర్స్ రాఘవను ఎంచుకున్నారు. రాఘవ పాత్రకు సపోర్టింగ్ గా ప్రముఖ కమెడియన్ వడివేలు నటిస్తున్నారు. హీరోయిన్లుగా త్రిష, లక్ష్మీ మీనన్, అనుష్క శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘చంద్రముఖి’ దర్శకుడు పీ వాసునే సీక్వెల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్‌డీ రాజశేఖర్ కెమెరామేన్‌గా.. ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి బాధ్యతలు చూస్తున్నారు.