ఒకే వేదిక పైకి రజనీ, బాలయ్య! వివరాలు

Published : Apr 24, 2023, 10:56 AM IST
ఒకే వేదిక పైకి రజనీ, బాలయ్య! వివరాలు

సారాంశం

 విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో 28న సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్నారు.


ఒకే వేదికపై బాలయ్య, రజనీ కనపడి అభిమానులకు ఆనందం కలిగించనున్నారు. ఇందు నిమిత్తం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈనెల 28న విజయవాడ రానున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు శత జయంతి ఉత్సవాలు విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో 28న సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్నారు.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా రజనీకాంత్‌తో పాటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటారు. వీరుముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సభలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలతో కూడిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పలు రంగాల ప్రముఖులుసైతం పాల్గోనున్నారు.

ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సభలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలతో కూడిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పలు రంగాల ప్రముఖులుసైతం పాల్గోనున్నారు.

తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనకు చరమ గీతం పలకాలని నట జీవితాని త్యాగం చేసి 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన మహోన్నత నాయకుడు, ఆదర్శ ప్రజా సేవకుడు, తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత అన్న ఎన్. టి. ఆర్ అని జనార్దన్ చెప్పారు.

రామారావు గారు భౌతికంగా దూరమై 27 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆయన ఇప్పటికీ జాతికి స్ఫూర్తి నిస్తూనే వున్నారు. ఆయన జీవితం తర తరాలకు మార్గదర్శనము కావాలనే ఈ మహాయజ్ఞానికి పూనుకున్నామని జనార్దన్ తెలిపారు. ఎన్.టి.ఆర్ ఘన కీర్తిని చాటే విధంగా విజయవాడ, హైదరాబాద్ లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెండు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని, తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు గారు, ఇతర జాతీయ నాయకులు, సినిమారంగ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని జనార్దన్ తెలిపారు.
 
అయితే ఈ ప్రయత్నానికి అన్నగారి అభిమానులు, వారితో సాన్నిహిత్యం ఉండి, మర్చిపోలేని సంఘటనలు, అపురూమైన ఫోటోలు ఎవరి దగ్గర వున్నా తమకు పంపించాలని మీడియా ద్వారా జనార్దన్ విజ్ఞప్తి చేశారు.   
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?