NTR30:మరో డైలాగు లీక్, వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది

Published : Apr 24, 2023, 10:13 AM IST
  NTR30:మరో  డైలాగు లీక్,  వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది

సారాంశం

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ సినిమా షూట్ శరవేగంగా అయితే జరుగుతోంది. ఎన్టీఆర్30 నుంచి లీకవుతున్న ప్రతి డైలాగ్ కూడా సినిమా పై అంచనాలను రెట్టింపు చేస్తోంది.   


స్టార్ సినిమాల్లో డైలాగులు లీక్ అవటం, ఫొటోలు లీక్ అయ్యి క్రేజ్ క్రియేట్ అవటం రెగ్యులర్ గా జరిగేదే. అయితే ఆ లీక్ అయిన డైలాగులు అభిమానుల సృష్టా లేక నిజంగానే సినిమాలో ఉన్నాయా అనేది మాత్రం రిలీజ్ అయ్యేదాకా తెలియదు.  పదిహేను రోజుల క్రితం ఎన్టీఆర్ 30 ఈ సినిమా డైలాగ్ గతం లో ఒకటి లీకై నెట్టింట బాగా వైరల్ అయింది. "యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు" అనే డైలాగ్  సోషల్ మీడియా లో బాగా హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా కు సంబంధించి మరో డైలాగ్  కూడా లీక్ కాగా ఆ డైలాగ్ తెగ వైరల్ అవుతుండటం విశేషం.

ఎన్టీఆర్30 సినిమాలో తారక్ సముద్ర వీరుడి గా కనిపించనున్నారని తెలుస్తుంది. "సమయం యుద్ధాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది.. ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుని ప్రచండ దాడికి సిద్ధం" అనే డైలాగ్ ఈ సినిమాలోదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండం విశేషం.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ సినిమా షూట్ శరవేగంగా అయితే జరుగుతోంది. ఎన్టీఆర్30 నుంచి లీకవుతున్న ప్రతి డైలాగ్ కూడా సినిమా పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. 

ఎన్టీఆర్ 30వ సినిమా కోసం వేసిన సెట్ లో షూటింగ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.   ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తోన్నారు.  ఆయన కూడా మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తారక్, సైఫ్ ఆలీఖాన్ కాంబినేషన్ లో యాక్షన్ సీక్వెన్స్, టాకీ పార్ట్ ని ఈ షెడ్యూల్ లో కొరటాల ఫినిష్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా నిమిత్తం సైఫ్ కు ఇచ్చే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. 
 
ఎన్టీఆర్ మూవీ కోసం సైఫ్ ఆలీఖాన్ 6 కోట్లకి పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. వాస్తవానికి సైఫ్ హీరోగా 15 కోట్లకి పైగానే అతను రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ 30 మూవీకి మాత్రం 6  కోట్ల మాత్రమే తీసుకోవడానికి కారణం ఉందట. ఈ సినిమాకి రెమ్యునరేషన్ తో పాటు రిలీజ్ తర్వాత హిందీ వెర్షన్ లాభాలలో వాటా ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారని వినికిడి.

సైఫ్ ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న #Adipurush లో రావణుడి పాత్రలో కనిపిస్తున్నారు. దీంతో అతను విలన్ గా టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు #NTR30 సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్