సెలబ్రిటీలను వదలని మహమ్మారి.. రాజేంద్రప్రసాద్‌, నటుడు విష్ణు విశాల్‌కి కరోనా..

Published : Jan 09, 2022, 03:48 PM IST
సెలబ్రిటీలను వదలని మహమ్మారి.. రాజేంద్రప్రసాద్‌,  నటుడు విష్ణు విశాల్‌కి కరోనా..

సారాంశం

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. సునామీలా దూసుకొస్తుంది. సెలబ్రిటీలను వదలడం లేదు. తాజాగా నట కీరిటీ రాజేంద్రప్రసాద్‌కి,  తమిళ నటుడు విష్ణు విశాల్‌కి కరోనా సోకింది.   

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. ఓ రకంగా విలయ తాండవం చేస్తుంది. గత రెండు వేవ్‌ల కంటే వేగంగా థర్డ్ వేవ్‌ దూసుకొస్తుంది. ఈ సారి సెలబ్రిటీలు సైతం విరవిగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు కరోనాకి గురయ్యారు. ఆయన హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు.  తమిళ నటులు సైతం వరుసగా కరోనా బారిన పడుతున్నారు. త్రిష, అరుణ్‌ విజయ్‌, వడివేలు, మీనా, సత్యరాజ్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కమల్‌ హాసన్‌ కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా నట కీరిటీ రాజేంద్రప్రసాద్‌కి,  తమిళ నటుడు విష్ణు విశాల్‌కి కరోనా సోకింది. 

తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. రాజేంద్ర ప్రసాద్‌ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. 

`ఎఫ్‌ఐఆర్‌` ఫేమ్‌ విష్ణు విశాల్‌ చెబుతూ, 2022 పాజిటివ్‌ రిజల్ట్ తో ప్రారంభమైంది. గాయ్స్ నాకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారం నన్ను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి. భయంకరంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి.  ముక్క బ్లాక్‌ అయిపోయింది. గొంతు నొప్పిగా ఉంది. కాస్త ఫీవర్‌గా ఉంది. మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తా` అని తెలిపారు విష్ణు విశాల్‌. దీంతో అభిమానులంతా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ సందేశాలు పంపిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Review: ధురంధర్ మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమాలో హైలైట్స్ ఇవే
Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే