నేనే అధ్యక్షుడిగా పోటీ చేద్దామనుకున్నా.. డ్రాప్ అయింది అందుకే , మా ఎన్నికలపై రాజశేఖర్

By telugu teamFirst Published Oct 9, 2021, 3:15 PM IST
Highlights

గత కొన్ని వారాలుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ వచ్చిన మా ఎన్నికల హంగామా తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 10 ఆదివారం రోజు మా ఎన్నికలు ముగియనున్నాయి. 

గత కొన్ని వారాలుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ వచ్చిన మా ఎన్నికల హంగామా తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 10 ఆదివారం రోజు మా ఎన్నికలు ముగియనున్నాయి. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్,మంచు విష్ణు లలో పోటీ ఎవరిదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు ఇద్దరూ హోరా హోరీగా ప్రచారం నిర్వచించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 

ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున జీవిత జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ కు రాజశేఖర్ మద్దతు తెలిపారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను కోవిడ్ లో చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళా. మీ అందరి ఆశీస్సులతో కోలుకున్నా. కానీ ఇప్పటికి నేను తెల్ల గడ్డంతో ఉండడం చూసి రాజశేఖర్ ఇంకా కోలుకోలేదా అని కొందరు అనుకుంటున్నట్లు సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ తెల్లగడ్డం తాను నటిస్తున్న శేఖర్ అనే మూవీ కోసం అని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. 

వాస్తవానికి మా ఎన్నికల విషయంలో తాను న్యూట్రల్ గా ఉండాలనుకున్నా. కానీ ప్రకాష్ రాజ్ గారు పోటీ చేస్తుండడం తెలిసి ఆయన రైట్ చాయిస్ అనిపించింది. అందుకే మద్దతు తెలపడానికి ముందుకు వచ్చా. అంతకంటే ముందు ఈ సారి మా ఎన్నికల్లో నేనే అధ్యక్షడిగా పోటీ చేద్దాం అని కూడా భావించా. కానీ డ్రాప్ అయ్యా. నా విజన్, ప్రకాష్ రాజ్ గారి విజన్ ఒక్కటే. ఆయన అన్ని భాషల్లో నటించే నటుడు. పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. 'మా' కి ఏమైనా అవసరం అయితే ఎక్కడి నుంచి అయినా తీసుకురాగలరు. అందుకే ప్రకాష్ రాజ్ ని గెలిపించాల్సిన అవసరం ఉంది అని రాజశేఖర్ అన్నారు. ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ విజయం సాధించాక మనం అందరం వనభోజనాలు చేసుకుందాం అని రాజశేఖర్ సభ్యులకు సూచించారు. 

ఇక రేపు జరగబోయే మా ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో మా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై సహాయ అధికారి నారాయణ రావు శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరికీ ఎన్నిక ప్రక్రియ గురించి వివరించినట్లు నారాయణ రావు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు రాత్రి ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు నారాయణరావు పేర్కొన్నారు.  

click me!