రాజశేఖర్ రెండో కూతురు కూడా హీరోయిన్ అవుతుందట!

Published : Aug 17, 2018, 04:27 PM ISTUpdated : Sep 09, 2018, 10:52 AM IST
రాజశేఖర్ రెండో కూతురు కూడా హీరోయిన్ అవుతుందట!

సారాంశం

వాస్తవానికి శివాత్మికను విద్యారంగంలో కొనసాగించాలని రాజశేఖర్ అనుకున్నారు. కానీ ఆమె సినిమాల పట్ల ఆసక్తిగా ఉండడంతో ఇక ఆమెను కూడా సినిమాల వైపు తీసుకురావాలని అనుకుంటున్నారు

టాలీవుడ్ లో హీరోగా నటించి ప్రేక్షకులకు దగ్గరైన నటుడు రాజశేఖర్. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన కూతుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది.

అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా మారనుందని వార్తలు వస్తున్నాయి. శివాత్మిక కూడా హీరోయిన్ అవ్వాలనుకుంటుందని జీవిత రాజశేఖర్ వెల్లడించారు. అయితే ఆమె హీరోయిన్ గా ఎప్పుడు పరిచయమవ్వనుందనే విషయంపై ఇంకా క్లారిటీకి రాలేదని అన్నారు.

వాస్తవానికి శివాత్మికను విద్యారంగంలో కొనసాగించాలని రాజశేఖర్ అనుకున్నారు. కానీ ఆమె సినిమాల పట్ల ఆసక్తిగా ఉండడంతో ఇక ఆమెను కూడా సినిమాల వైపు తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పట్లో ఆమె ఎంట్రీ ఉండదని తెలుస్తోంది. ఈలోగా కాంబినేషన్స్ అన్నీ సెట్ చేసి ఆమెను పరిచయం చేయాలని జీవిత దంపతులు ప్లాన్ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు