నితిన్ 'ఎక్స్ట్రా' లో రాజశేఖర్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా.. ఎవ్వరూ ఊహించలేరు.. 

By Asianet NewsFirst Published Nov 26, 2023, 5:30 PM IST
Highlights

ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఫన్నీగా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. నితిన్ కంప్లీట్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇటీవలే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేసారు. 

అలాగే ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఫన్నీగా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. నితిన్ కంప్లీట్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు. బాహుబలి చిత్రంలో 6వ లైన్ లో 7వ వాడు ఎవడో తెలుసా అంటూ నితిన్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 8న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

Latest Videos

ఈ చిత్రంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ ఇలా ఇతర హీరోల చిత్రాల్లో రోల్ ప్లే చేయడం ఇదే తొలిసారి. తాజాగా ఇంటర్వ్యూలో డైరెక్టర్ వక్కంతం వంశి రాజశేఖర్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వివరించారు. ఈ చిత్రంలో ముందు నుంచి రాజశేఖర్ గారి పాత్ర అనుకున్నాం. 

అయితే ఆయన ఒప్పుకుంటారా లేదా అనే సందేహం ఉండేది. ఆయన్ని వెళ్లి కలసి కథ వినిపించగా చాలా బావుంది.. చేస్తాను అని అన్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ గారు పోషించిన పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది అని వక్కంతం వంశి అన్నారు. రాజశేఖర్ గారి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నట్లు నితిన్ తెలిపాడు. 

ఈ చిత్రంలో ఆయన ఉండడం తప్పకుండా ప్లస్ అవుతుందని నితిన్ తెలిపాడు. నా 20 ఏళ్ల కెరీర్ లో 32వ చిత్రం ఇది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఇంతకు ముందెప్పుడూ నేను చేయలేదు అని నితిన్ తెలిపాడు. ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!