కొత్త సినిమాని ప్రకటించిన రాజశేఖర్‌.. టైటిల్‌తోనే హైప్‌ తీసుకొస్తున్నాడుగా!

Published : Mar 26, 2021, 08:44 AM IST
కొత్త సినిమాని ప్రకటించిన రాజశేఖర్‌.. టైటిల్‌తోనే హైప్‌ తీసుకొస్తున్నాడుగా!

సారాంశం

ఎట్టకేలకు ఆయన ఇటీవల రెండు సినిమాలను ప్రకటించారు. తాజాగా మరో సినిమా `మర్మాణువు`ని ప్రకటించారు హీరో రాజశేఖర్‌. దీనికి `కేరాఫ్‌ కంచరపాలెం`,  `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రాన్ని రూపొందించిన వెంకటేష్‌ మహా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 

హీరో డా. రాజశేఖర్‌ కెరీర్‌ గత కొంత కాలంగా ఒడిదుడుకులతో సాగుతుంది. `గరుడవేగ` చిత్రంతో ఆయన హిట్‌ అందుకుని పూర్వవైభవాన్ని పొందారు. కానీ తర్వాత మళ్లీ మొదటికొచ్చింది. `కల్కి` ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం, కొత్త సినిమా కమిట్‌ అవ్వడానికి చాలా టైమ్‌ పట్టడంతో మళ్లీ సీన్‌ రివర్స్ అయ్యింది. ఎట్టకేలకు ఆయన ఇటీవల రెండు సినిమాలను ప్రకటించారు. తాజాగా మరో సినిమా `మర్మాణువు`ని ప్రకటించారు. దీనికి `కేరాఫ్‌ కంచరపాలెం`,  `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రాన్ని రూపొందించిన వెంకటేష్‌ మహా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.  విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మించనున్నారు.

దర్శకుడు వెంకటేష్ మహా (మార్చి 25) పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్నిప్రకటించారు. `వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం` అని శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి చెప్పారు.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్