ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి ఇటీవలే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేసారు.
రచయితగా లెన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన వక్కంతం వంశి దర్శకుడిగా తొలి ప్రయత్నంలో తడబడ్డారు. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీనితో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంతో ఎలాగైనా విజయం అందుకోవాలని వక్కంతం వంశి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం ముందుగా డిసెంబర్ 22న రిలిజ్ కి రెడీ అయింది. అయితే ఆ తేదీలో ప్రభాస్ సలార్ వస్తుండడంతో నితిన్ చిత్రం ప్రీపోన్ అయింది. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ చిత్రంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలే నేడు నిజమయ్యాయి. యాంగ్రీ హీరో రాజశేఖర్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు రాజశేఖర్ సెట్స్ కి వెళుతున్న క్రేజీ వీడియో కూడా రిలీజ్ చేశారు.
The Most Celebrated Angry Man of Telugu Cinema and the epitome of versatility garu has set foot on the sets of 🤩🔥🤙🏾
His Fiery Performance is going to spellbind you ❤️🔥 pic.twitter.com/8jRCr2LzQ9
తెలుగు సినిమాలో మోస్ట్ సెలెబ్రేటెడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఆయన పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉండబోతోంది అంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. రాజశేఖర్ గడ్డం లుక్ లో స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు డైరెక్టర్ వక్కంతం వంశీ, నిర్మాత సుధాకర్ రెడ్డి రాజశేఖర్ కి స్వాగతం పలికారు.