ఆమిర్ ఖాన్ కు షాకిచ్చిన‌ రజనీకాంత్

Published : Dec 09, 2016, 01:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఆమిర్ ఖాన్ కు షాకిచ్చిన‌ రజనీకాంత్

సారాంశం

ఆమిర్ ఖాన్ కి నో చెప్పిన ర‌జ‌నీకాంత్  దంగల్ మూవీ తమిళ వెర్షన్ కు ర‌జ‌నీతో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని అనుకున్న ఆమిర్ డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ఒప్పుకోని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ

మరి ఈ సినిమా వచ్చింది, వెళ్లింది అన్నట్టుగా కాకుండా… దక్షిణాదిలో తనకున్న పరపతిని ఉపయోగించుకుని ఆ సినిమాపై జనాల్లో ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఒక ఆసక్తికరమైన ఎత్తుగడే వేశాడట. దంగల్’ తమిళ వెర్షన్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో డబ్బింగ్ చెప్పించాలని భావించాడట ఆమిర్.

 ఈ విషయంలో సూపర్ స్టార్ ను రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడట. అయితే దానికి రజనీ నో చెప్పినట్టు సమాచారం. దీంతో తన సినిమాకు తమిళనాట సూపర్ స్టార్ ద్వారా హైప్ తీసుకురావడానికి ఆమిర్ వేసిన ఎత్తుగడలు సక్సెస్ కాలేదట.ఒకవేళ ‘దంగల్’ కు రజనీ గొంతు అరువిచ్చి ఉంటే.. అరవ జనాల మధ్య ఆ సినిమా కు క్రేజ్ బాగా పెరిగేది. కానీ ఆమిర్ కు కలిసి రాలేదు.

 90లలో సూపర్ స్టార్ ,ఆమిర్ లు కలిసి ఒక సినిమాలో కలిసి నటించారు కూడా. . అయితే ఎందుకో..  ఇప్పుడు రజనీ ఆసక్తి చూపలేదు! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రోబో-2 లో మొదట విలన్ గా ఆమిర్ ను చేయమని అడిగాడట దర్శకుడు శంకర్. దానికి అతడు సమ్మతించలేదు. చివరకు ఆ అవకాశం అక్షయ్ వద్దకు వెళ్లింది. 

PREV
click me!

Recommended Stories

సౌత్ సినిమాలపై నోరు పారేసుకున్న హీరోయిన్, రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ ..
5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?