Rajamouli:ప్రభాస్ మామూలోడు కాదు మహాప్రభో..రాజమౌళిని లాగేసాడు!

Surya Prakash   | Asianet News
Published : Feb 27, 2022, 12:46 PM IST
Rajamouli:ప్రభాస్ మామూలోడు కాదు మహాప్రభో..రాజమౌళిని లాగేసాడు!

సారాంశం

 తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి విడుదలకు సిద్దంగా ఉన్న మూవీ ‘రాధేశ్యామ్’. అన్ని కార్యక్రామాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ, మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా 7 భాషల్లో విడుదల కానుంది. అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమా కు అదనపు హంగులు సమకూరుతున్నాయి.  

 
రాజమౌళికి, ప్రభాస్ కు ఉన్న అనుబంధం తెలిసిందే. ప్రభాస్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా మార్చటం వెనుక ఘనత రాజమౌళిదే. అదే విధంగా ప్రభాస్ సినిమాలకు తనకు తోచిన సలహాలు ఇస్తూంటాడు. సాయిం చేస్తూంటాడు. అలాగే ఇప్పుడు మరోసారి రాజమౌళి ని రిక్వెస్ట్ చేసి రాధేశ్యామ్ సినిమాలోకి తీసుకువచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...

‘బాహుబలి’ సిరీస్ తో పాన్ ఇండియన్ స్టార్ గానే కాదు యూనివర్సల్ స్టార్ గా ఎదిగారు హీరో ప్రభాస్. ఆ ఒక్క సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది. ఆ తర్వాల భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సాహో’ సినిమా బాలీవుడ్ లో దుమ్ముదులిపింది. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి విడుదలకు సిద్దంగా ఉన్న మూవీ ‘రాధేశ్యామ్’. అన్ని కార్యక్రామాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ, మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా 7 భాషల్లో విడుదల కానుంది. అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమా కు అదనపు హంగులు సమకూరుతున్నాయి.

ఈ క్రమంలోనే  దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రాధేశ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆయన బేస్ వాయిస్‌తో కథ నేరేట్ చేసే విధానం ఆకట్టుకుంటుందని ఇప్పటికే ఆయన వాయిస్ ఓవర్ చెప్పేశారని తెలుస్తోంది. ప్రభాస్ – రాజమౌళిల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే, ప్రభాస్ కోసం రాజమౌళి వచ్చారంటున్నారు.

ఇక  ఈ సినిమాకు వాయిస్ ఓవర్ హైలెట్ అవుతుందని  వార్తలు వస్తున్నాయి. హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ చెప్పినప్పటి నుంచి ఎక్సపెక్టే,షన్స్ మరీ పెరిగిపోయాయి. ఇక సౌత్  భాషల కు వాయిస్ ఇచ్చే స్టార్స్ వీరే అంటూ నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపించింది. కానీ, ఇందులో నిజం లేదు. మహేశ్ బాబు వాయిస్ ఇస్తున్నారన్న వార్తలు అవాస్తవం అని రాజమౌళి చేత రచ్చ చేయించేసారని తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?