సీపీఐ నారాయణపై నోరు జారిన తమన్నా... చెప్పుతో కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు...

Published : Feb 27, 2022, 12:04 PM IST
సీపీఐ నారాయణపై నోరు జారిన తమన్నా... చెప్పుతో కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు...

సారాంశం

బిగ్ బాస్ షో మళ్ళీ వివాదాలకు కారణం అవుతుంది. కాంట్రవర్షియల్ కామెంట్స్ కు వేదిక అవుతుంది. బిగ్ బాస్ పై పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు మాజీ కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ షో మళ్ళీ వివాదాలకు కారణం అవుతుంది. కాంట్రవర్షియల్ కామెంట్స్ కు వేదిక అవుతుంది. బిగ్ బాస్ పై పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు మాజీ కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన  సీపీఐ లీడర్  నారాయణపై బిగ్ బాస్ లవర్స్ మండిపడుతున్నారు. ఆయనకేనా నోరు ఉన్నది మాకు లేదా?  అంటూ  బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. నారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొంత మంది కంటెస్టెంట్స్  ఏకంగా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో.. విరుచుకుపడుతున్నారు.

ఇక రీసెంట్ గా బిగ్ బాస్ కు సంబంధించిన కాంట్రవర్సీపై జరిగిన ఓ డిబెట్ లో రచ్చ జరిగింది. డిబెట్ లో  సీపీఐ నారాయణపై బిగ్ బాస్ లో పాల్గొన్న ట్రాన్స్ జెండర్ తమన్నా విరుచుకుపడింది. విమర్షలతో పోనివ్వకుండా ఏకంగా సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి అని వివాదాస్పద వ్యాఖ్యులు చేసింది బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా.  హాట్ హాట్ గా జరిగిన ఈ చర్చలో.. అవేశంలో నారాయణపై నోరు జారింది తమన్నా.

అంతే కాదు తమన్నా మాట్లాడుతూ ఏకంగా.. ఈ చర్చకు సీపీఐ నారాయణను కూడా పిలవాలని కోరింది. బిగ్ బాస్ హౌస్ ను  బ్రోతల్ హౌస్ అన్నందుకు కోపంతో ఊగిపోయిన తమన్నా.. ఇక్కడ ఉంటే చెప్పుతో కొట్టేదాన్ని అని ఫైర్ అయ్యింది. ఇక అంత పెద్ద మనిషి.. సీపీఐ నారాయణను పట్టుకొని అలా అనడంతో చర్చలో పాల్గొన్న వారంతా షాక్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే గతంలో చాలా వివాదాల్లో నారాయణ చిక్కుకున్నా.. ఆయనకు సౌమ్యుడు అనే పేరు ఉంది. చాలా విషయాల్లో అయన తన వైపు వాదన వినిపిస్తారు. కాని ఆయనపై ఎప్పుడూ ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఫస్ట్ టైమ్ సీపీఐ నారాయణ పై ఈ కామెంట్స్ తో అందరూ షాక్ అయ్యారు.

కాని చాలామంది పెద్దలు బిగ్ బాస్ ను బలవంతంగా ప్రజలపై రుద్దుదున్నారు అని ఆరోపిస్తున్నారు. డిబెట్లో పాల్గోన్నవారిపై కూడా తమన్నా ఘాటుగాను స్పందించింది. మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు అంది. ఎవరైనా అంతే. వారికి ఇష్టం ఉంటే చూస్తారు నచ్చకుంటే లేదు. దీనిలో బలవంతం ఏముంది.. వివాదం ఏముంది అన్న అభిప్రయాన్ని వ్యాక్తం చేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?