RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

By Prashanth MFirst Published Nov 13, 2018, 2:47 PM IST
Highlights

బాహుబలి అనంతరం టాలీవుడ్ లో అత్యంత భారీబడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం RRR. రాజమౌళి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో గాని సినిమాకు సంబందించిన గాసిప్స్ ఇప్పట్లో తగ్గేలా లేవు. 

బాహుబలి అనంతరం టాలీవుడ్ లో అత్యంత భారీబడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం RRR. రాజమౌళి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో గాని సినిమాకు సంబందించిన గాసిప్స్ ఇప్పట్లో తగ్గేలా లేవు. సినిమా షూటింగ్ మొదలవ్వకముందే పాత్రల గురించి కథ గురించి అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. 

ఇకపోతే రాజమౌళి ఈ సారి టెక్నీషియన్స్ విషయంలో కొద్దిపాటి మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాటల రచయితల విషయంలో దర్శకదీరుడు బాగా ఆలోచించినట్లు ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ ను ఈక్వల్ గా మెయింటైన్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. 

అందుకే అన్ని విషయాల్లో ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఉండటానికి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. స్పెషల్ గా సాయి మాధవ్ బుర్ర గారిని కూడా రాజమౌళి ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైలాగ్స్ రైటర్ గా ఉన్న సాయి మాధవ్ సైరా వంటి సినిమాకు పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. గౌతమి పుత్ర శాతకర్ణి - మహానటి - ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో ఆయన రాసిన మాటలకూ మంచి గుర్తింపు దక్కింది. 

ఇక సాధారణంగా రాజమౌళి ఎమోషన్ అండ్ యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువగా ద్రుష్టి పెడతారు. అయితే RRRలో ఈ సారి డైలాగ్స్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నాడట. ఇద్దరి హీరోలకు స్ట్రాంగ్ డైలాగ్స్ ఉండాలని  సాయి మాధవ్ తో వర్క్ చేస్తున్నారు. కథలో డైలాగ్స్ వచ్చే సందర్భాలు చాలానే ఉన్నాయట. మరి ఆ మాటలు ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

click me!