ప్రభాస్‌ రాముడిగా.. ముందే తెలుసంటున్న జక్కన్న

Published : Aug 25, 2020, 04:19 PM IST
ప్రభాస్‌ రాముడిగా.. ముందే తెలుసంటున్న జక్కన్న

సారాంశం

తాజాగా `ఆదిపురుష్‌` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. 

ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మూడూ పాన్‌ ఇండియా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న చిత్రాలివి. అందులో `రాధేశ్యామ్‌` ప్రస్తుతం తెరకెక్కుతుండగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్‌ చేయబోతున్నాడు. దీంతోపాటు అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తూ గత వారం `ఆదిపురుష్‌` పేరుతో ఓ పౌరాణిక ప్రాజెక్ట్ ని ప్రభాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిపై ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, రాముడిగా ప్రభాస్‌ కనిపించనున్నారు.

తాజాగా `ఆదిపురుష్‌` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. ఆయన చెబుతూ, `ఆదిపురుష్‌` చిత్ర పోస్టర్‌ని అందరి కంటే ముందే చూశా. అద్భుతంగా ఉంది. రాముడి పాత్రకి ప్రభాస్‌ పర్‌ఫెక్ట్ యాప్ట్, ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం  నిర్మాణం  జరుగుతుంది. ఈ సమయంలో రాముడిపై సినిమా తీయడం అభినందనీయం` అని చెప్పారు.

`దేశం మొత్తం రాముడి గురించి చర్చ జరుగుతుండగా, ఆయనపై సినిమా వస్తే దానికి మరింత క్రేజ్‌ వస్తుంది. అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ప్రభాస్‌ స్థాయిని పెంచుతుంది. సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం ఉండబోతుంద`ని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఆయన `ఆర్‌ ఆర్‌ ఆర్‌` పేరుతో పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతుంది. ఇది కూడా గ్రాండియర్‌గా రూపుదిద్దుకుంటోంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు