
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదలై మూడు వారాలు పూర్తైన కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో జనం నీరాజనం పలుకుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో గత రికార్డులన్నింటిని తిరగరాస్తూ ట్రిపుల్ ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది.
తారక్, చరణ్ అద్భుతమైన నటన.. రాజమౌళి విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయంటూ మెచ్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్‌లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిరాక్డ్స్ స్థాయిలో వసుళ్లూ రాబడుతూ దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్ మూవీ అని అఫీషియల్ గా ప్రకటించారు కూడా.
ఈ ఉత్సాహంలో ఈ చిత్రాన్ని విదేశాల్లోనూ విడుదల చేసేందుకు చిత్ర టీమ్ ప్లాన్ చేస్తోంది. అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్‌లో జపాన్‌లో RRR విడుదల కానుంది. చైనా విడుదల కూడా ఈ ఏడాది చివర్లో జరగనుంది. నిర్మాతలు కనీసం ముప్పై వేర్వేరు దేశాల డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరుపుతున్నారు. మరి ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో లేదో చూడాలి. గతంలో బాహుబలి 2 జపాన్, చైనాలలో మంచి వసూళ్లు సాధించింది.
ఇవన్నీ ట్రిపుల్ ఆర్ జోరు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు… బాహుబలి రికార్డును బీట్ చేసే ఎయిమ్‌తో రంగంలోకి దిగిన ట్రిపుల్ ఆర్ … ఆ ఎయిమ్‌ను దాదాపు రీచ్ అయిపోయి.. అతి తొందర్లో ఫినిష్ చేసే దిశగా పరుగెడుతోంది. తాజాగా వరల్డ్ వైడ్ థౌజెండ్ క్రోర్స్ వసూలు చేసి బాంబేలో సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకున్న ఈ మూవీ టీం… తాజాగా థౌజెండ్ క్రోస్ ప్లస్ … వసూళ్లను చాలా ఫాస్ట్ గా సాధిస్తోంది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే 200 క్రోర్స్ వసూలు చేసిన ట్రిపుల్ ఆర్…ఈ సీజన్‌లో ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ఇప్పటికే తన మరో ప్రాజెక్ట్‌కి వెళ్లాడు. అమృత్‌సర్‌లో #RC15 షూటింగ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం జూన్‌లో ప్రారంభం కానున్న కొరటాల శివ #NTR30 కోసం సిద్ధమవుతున్నాడు.