
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్ 2. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంచనా. నెట్ వసూళ్ల ప్రకారం చూస్తే ఇది దాదాపు రూ.130 కోట్లు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజున రూ.223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఆ లెక్కలో రూ.73 కోట్ల రూపాయలు వసూళ్లు ట్రిపుల్ ఆర్‌కి ఎక్కువగా వచ్చాయి.
ఇక కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అదిరిపోయే నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రేక్షకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి సిక్వెల్‍గా వచ్చిన కేజీఎఫ్ 2 అంతకు మించి అన్నట్టుగా థియేటర్లలో దూసుకుపోతూండటం విశేషం. విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది.
కేజీఎఫ్ హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 మూవీ రూ. 33 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం కలిపి రూ. 50 కోట్లు వసూలు చేసిందట. మొత్తానికి దేశవ్యా్ప్తంగా కేజీఎఫ్ 2 కలెక్షన్స్ రూ. 150 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవినా టాండన్, శ్రీనిధి శెట్టి కీలకపాత్రలలో నటించారు. గరుడను చంపిన రాకీభాయ్‌గా, ఫస్ట్ పార్ట్ లో చూపించిన సేమ్ మేనరిజమ్, సేమ్ డైలాగ్ డెలివరీతో మాస్‌లో ఫైర్ పుట్టించే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు యష్. . ఇక ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా బాలీవుడ్ టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో కేజీయఫ్ 2 చిత్రానికి టాప్ ప్లేస్‌లో స్థానం ఇచ్చాడు. ఇక రెండో ప్లేస్‌లో బాహుబలి 2 చిత్రం నిలిచినట్లు ఆయన లెక్కలతో సహా పేర్కొన్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ 2 స్పీడు చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ దుమ్ములేపే కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.