‘‘ మా ’’ ఎన్నికల్లో మహా ట్విస్ట్: ప్రకాశ్ రాజ్ వెంటే జీవితా రాజశేఖర్, హేమ.. ఒంటరైన మంచు విష్ణు

By Siva KodatiFirst Published Sep 3, 2021, 4:58 PM IST
Highlights

మా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డేట్ అనౌన్స్‌ చేయడంతో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌ను ప్రకటించారు . అధ్యక్ష బరిలో నిలిచిన జీవితా రాజశేఖర్, హేమలను సైతం అనూహ్యంగా తన ప్యానెల్‌లోకి చేర్చారు ప్రకాశ్ రాజ్.


మా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో మరోసారి వాతావరణం హాట్ హాట్‌గా మారింది. సీనియర్ నటుడు నరేశ్.. ఓ హోటల్‌లో పార్టీ ఇచ్చిన వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ శుక్రవారం మీడియాకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కల, లక్ష్యాలు, ఆశయాలకు సంబంధించి గతంలోనే మీడియా సమావేశంలో చెప్పానన్నారు.

అప్పడు తనతో పాటు ఓ గ్రూప్‌లా మీడియా ముందుకు వచ్చిన వారు ప్యానెల్ కాదన్నారు. ఎన్నికల కోసం ఎంతగానో ఎదురుచూశామన్నారు. ఎలాంటి వారు ప్యానెల్‌లో వుండాలనే దానిపై కసరత్తు చేశామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరెవరు మా సభ్యుల  కోసం సమయాన్ని కేటాయించగలుగుతారనే దానిపై డిస్కషన్ చేశానని ఆయన వెల్లడించారు. ఇండస్ట్రీకి సేవ చేయాలన్నదే మా లక్ష్యమని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. మేం ఏంటో చూపిస్తామని.. మా ప్యానెల్‌లో మహిళలకు అవకాశం కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ను ప్రకటించారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్

  • అనసూయ
  • అజయ్
  • రూపాల్
  • బ్రహ్మాజీ
  • ఈటీవీ ప్రభాకర్
  • గోవిందరావ్
  • ఖయ్యుం
  • కౌశిక్
  • ప్రగతి
  • రమణారెడ్డి
  • శ్రీధర్ రావు
  • శివారెడ్డి
  • సమీర్
  • సుడిగాలి సుధీర్
  • సుబ్బరాజు
  • సురేశ్ కొండేటి
  • తనీశ్


ఇక ట్రెజరర్ ఎవరన్న దానికి వస్తే.. నాగినీడుని ఎంపిక చేశామని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆయనకు ప్రసాద్ ల్యాబ్‌ లాంటి మహాసంస్థను నడిపిన అనుభవం వుందని, అకౌంట్స్ గురించి తెలుసునని .. ముక్కుసూటి తనం వుందని నాగినీడును ప్రశంసించారు. 

జాయింట్ సెక్రటరీల విషయానికి వస్తే .. అనితా చౌదరిని ఆయన ప్రకటించారు. మహిళల హక్కుల గురించి ఆమె పోరాడతారని ప్రశంసించారు. అలాగే మరో జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్‌ను ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. నాటక రంగంతో పాటు సినీ రంగంలో ఉత్తేజ్‌కు అపార అనుభవం వుందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. 

వైస్ ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే బెనర్జీని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆయనకు ఈసీ మెంబర్‌గా, జాయింట్ సెక్రటరీగా మా అసోసియేషన్‌లో పనిచేశారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మరో వైస్ ప్రెసిడెంట్‌గా హేమను ప్రకటించారు. ఆమె కూడా మా అధ్యక్ష బరిలో  నిలిచారని.. అయితే తాము వెళ్లి మాట్లాడటంతో మా ప్యానెల్‌లో చోటు కల్పించామని ప్రకాశ్ రాజ్ తెలిపారు. 

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌గా శ్రీకాంత్‌ను ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌ను ప్రకటించారు ప్రకాశ్ రాజ్. ఆమెతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని.. మా అసోసియేషన్ మూడు , నాలుగు విభాగాలుగా విడిపోకూడదని తాను చెప్పినట్లు ఆయన చెప్పారు. 

click me!